English | Telugu

విక్రమ్ కీలక నిర్ణయం.. షాక్ లో ఫ్యాన్స్ 

ప్రేక్షకులని మెప్పించడం కోసం హీరో తన క్యారక్టర్ పరంగా ఎంత కష్టమైనా పడతాడు. కానీ ఆ పరిధిని దాటి క్యారక్టర్ కోసం మరింత కష్టపడే హీరో ఎవరంటే విక్రమ్(Vikram)అని చెప్పవచ్చు. విక్రమ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలే అందుకు ఉదాహరణ. ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా అన్నిఅలాంటి చిత్రాల్లోనే చేస్తు అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు. నటనా పరంగా విక్రమ్ కి మంచి పేరే వస్తుంది. కానీ కమర్షియల్ గా హిట్ అవ్వకపోవడమే కాకుండా కలెక్షన్స్ కూడా రావడం లేదు. ఇందుకు ప్రీవియస్ మూవీ 'తంగలాన్' ఒక ఉదాహరణ. దీంతో విక్రమ్ ఒక కీలక నిర్ణయం తీసున్నట్టుగా తెలుస్తుంది.

విక్రమ్ ప్రస్తుతం '63 'అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం తంగలాన్ కంటే ముందే స్టార్ట్ అవ్వగా కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకుంది.ఇక ప్రాజెక్ట్ లేట్ అవుతుండటంతో ఈ చిత్ర దర్శకుడు మడోన్ అశ్విన్ మధ్యలోనే వెళ్ళిపోయాడు. దీంతో మరో దర్శకుడ్ని ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఇక విక్రమ్ వరుస ప్లాప్ ల్లో ఉండటంతో ఈ చిత్రానికి సంబంధించిన ఓటిటి, శాటిలైట్, డిజిటల్ రైట్స్ బాగా తగ్గిపోయాయి. ఈ విషయాన్ని కారణంగా చూపుతు సదరు సంస్థ విక్రమ్ తో రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరింది. తన ప్రస్తుత పరిస్థితి తెలిసిన విక్రమ్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లుగా తెలుస్తుంది.

ఇక విక్రమ్ హిట్ ని అందుకొని సుమారు పది సంవత్సరాలు అవుతుంది. 2022 ,2023 లో పొన్నియన్ సెల్వం పార్ట్ 1 ,పార్ట్ 2 తో ఒక మాదిరి విజయాన్ని అందుకున్నా, ఆ క్రెడిట్ మొత్తం విక్రమ్ కి రాదనే విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో వీర ధీరశురన్ తో పలరించాడు. ఈ చిత్రం కూడా కలెక్షన్స్ పరంగా పెద్దగా ప్రభావం చూపించలేదు.



50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.