English | Telugu

వరద బాధిత మృతులకు రూ.5లక్షల పరిహారం : సీఎం రేవంత్

వరద సహాయక చర్యలను అధికారులు పకడ్బందీగా అందించాలి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో భారీ వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, కుంటల వివరాలు సేకరించాలని, వీటి మరమ్మత్తు , పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరదల వల్ల మరమ్మతులకు గురైన పంచాయతీ రోడ్లు, రోడ్లు భవనాల శాఖ రోడ్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల క్రింద పునరుద్ధరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు.

వరదలలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. మరిన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. విపత్తుపై సమగ్ర నివేదికను తయారు చేసి కేంద్రానికి ఇవ్వాలని అధికారులను సీఎం సూచించారు.