English | Telugu

Brahmamudi : రాహుల్, కావ్యల మాటలకి టెంప్ట్ అయిన కోయిలి.. రంజిత్ చూసేశాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -866 లో...... రంజిత్, కోయిలి మాట్లాడుకుంటారు. ఎలాగైనా ఆ ఇంటికి కోడలు అయి ఆస్తులన్నీ లాగేసుకుంటానని రంజిత్ తో కోయిలి అంటుంది. అప్పుడే రాహుల్ బ్యాగ్ తో ఎంట్రీ ఇస్తాడు. ఏంటి రాహుల్ ఈ టైమ్ లో వచ్చావ్.. చేతిలో ఈ బ్యాగ్ ఏంటని రాహుల్ ని కోయిలి అడుగుతుంది. నన్ను అక్కడ అర్ధం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు.. అందుకే అక్కడ నుండి వచ్చేసానని రాహుల్ అనగానే అలా ఎందుకు వచ్చావ్.. నీ కుటుంబం చూసే కదా నేను నిన్ను లవ్ చేసింది అని కోయిలి అనగానే రాహుల్ షాక్ అవుతాడు.

Karthika Deepam2 : ఇంటికి తిరిగొచ్చిన సుమిత్ర.. షాక్ లో జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -503 లో.....సుమిత్ర కన్పించడం లేదని జ్యోత్స్న కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దీపని అరెస్ట్ చేస్తారు. దీపతో కాంచన కూడా స్టేషన్ కి వస్తుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి జ్యోత్స్నపై కోప్పడతాడు. మా మమ్మీని ఈ దీప కిడ్నాప్ చేసిందని జ్యోత్స్న అంటుంది. అందుకు ఆధారాలు ఉన్నాయా అని శివన్నారాయణ అడుగుతాడు. తనే చేసిందని జ్యోత్స్న అంటుంది. ఇన్‌స్పెక్టర్ మీ దగ్గర ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారని ఇన్‌స్పెక్టర్ ని శివన్నారాయణ అడుగుతాడు..

శైలజ గారిని స్నేక్ అన్న ఈర్య...

సరిగమప లిటిల్ చాంప్స్ ప్రోమో చూసి నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఏంటి డైలాగ్స్ మార్చండి అంటూ కామెంట్స్ లో మండిపడుతున్నారు. విషయం ఏమిటి అంటే ఈ షోకి డ్రామా జూనియర్స్ లో చేసిన ఈర్య వచ్చింది. రాగానే పెద్ద పెద్ద డైలాగ్స్ వేసింది. ఆ షోలో ఉన్నంత వరకు అనిల్ మామ అనిపించారు. ఇక ఇందులో అనంత్ మామ అనిపించడం మొదలుపెట్టారు. "నువ్వెందుకు వచ్చావమ్మ" అని శైలజ అడిగేసరికి "అందరి లెక్కలు తెలుస్తా ఈర్య తిక్కేంటో చూపిస్తా" అంది. "ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మా అంటారు కానీ నేను మామ" అంటాను అనేసరికి అనిల్ రావిపూడి థ్యాంక్యూ ఈర్య అన్నారు. వెంటనే ఆ పిల్ల "ఐ లవ్ యు అనంత్ మామ" అనేసింది.

కళ్యాణం కోసం కంకణం కట్టించుకున్న రోహిణి...

ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ గా ఇది రాబోతోంది. ఈ షోకి రోహిణి, సుహాసిని, ప్రిన్సి, సమీరా భరద్వాజ్, కావ్య, సిరి హన్మంత్, నయని పావని, లాస్య మంజునాథ్, ప్రియాంక జైన్, గాయత్రి అంతా వచ్చారు. ఇక గోదావరి మూవీలో హిట్ సాంగ్ "అందంగా లేనా అస్సలేం బాలేనా" అనే సాంగ్ ని ఒక్కో లైన్ కి ఒక్కొక్కరు భలే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇక లాస్య ఎక్స్ప్రెషన్ కి ఐతే శ్రీముఖి ఫుల్ ఫిదా ఐపోయింది. "మంజు ఇది చూసాకా ఐపోతావ్ పుంజు" అంటూ శ్రీముఖి లాస్య గురించి చెప్పుకొచ్చింది. సమీరా ఐతే అదే సాంగ్ పాడుతూ కైపుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టేసరికి అవినాష్ చూసి "ఇది చూసి అబ్బాయిలంతా అల్లాడిపోతారు" అన్నాడు. ఇక హరి వచ్చి "మా సైడ్ నుంచి రోహిణిని డ్రాప్ చేస్తాం అటు నుంచి ప్రిన్సిని డ్రాప్ చేయండి" అని శ్రీముఖికి చెప్పాడు. తర్వాత రోహిణి కూడా అదే పాట పాడుతూ అందంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది.

శృతి హాసన్ కోసం కవిత చెప్పిన ధీరజ్...

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాస్ట్ వీక్ ఎపిసోడ్ కి శృతి హాసన్ వచ్చి థమన్ తో కలిసి మంచి మంచి పాటలు పాడి అలాగే కంటెస్టెంట్స్ కి బ్లేసింగ్స్ ఇచ్చి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. ఇక కంటెస్టెంట్ ధీరజ్ ఒక సాంగ్ పాడి ఆ తర్వాత శృతి హాసన్ మీద ఒక కవిత చెప్పాడు. "మీరు పాట పాడితే ఒక సెన్సేషన్, మీరు డాన్స్ వేస్తె అదొక సెలబ్రేషన్, మీకు ఆసక్తికరమైన విషయం ఏదైనా ఉంది అంటే అది మ్యూజికల్ క్రియేషన్, మీ యాక్టింగ్ లో మీరే కమల్ హాసన్, మిమ్మల్ని చూస్తే కరిగిపోతుంది ఆ సన్, ఈరోజు మా అందరితో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ లో మా అందరితో శృతి కలపడానికి వచ్చారు మా శృతి హాసన్" అంటూ చాల భావయుక్తంగా చెప్పాడు. "నాకు నీ కవిత మొత్తం అర్ధమయ్యింది.

Bigg Boss 9 Telugu : డీమాన్ మాట వినకుండా ఓడిపోయిన శ్రీజ.. లీడ్ లో భరణి!

బిగ్ బాస్ సీజన్-9 లో ఒక్కో రోజు ఒక్కోలా కంటెస్టెంట్స్ ఆటతీరు సాగుతోంది. ఇక భరణి, శ్రీజల మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది. హౌస్ పర్మినెంట్ హౌస్ మేట్ ఎవరవుతారని ఇద్దరి మధ్య టాస్క్ ల మీద టాస్క్ లు జరుగుతున్నాయి. మొన్నటి టాస్క్ లో శ్రీజ విన్ అయింది. అందులో సంచాలక్ నిర్ణయం సరిగ్గా తీసుకోలేదు.. తర్వాత మాధురికి సంఛాలక్ ఇవ్వగా శ్రీజ టీమ్ విన్ అయింది. దాంతో ఆ టాస్క్ ని నిన్న బిగ్ బాస్ రద్దు చేసాడు. నిన్న హౌస్ లో మొత్తం మూడు టాస్క్ లు జరుగగా.. మొదటి టాస్క్ మెయిజ్ టాస్క్.  అందులో భరణి చెయ్ కి గాయం ఉండడంతో తన తరుపున దివ్య ఆడింది. ఫస్ట్ టాస్క్ లో దివ్య, శ్రీజ పోటీ పడగా అందులో దివ్య గెలుస్తుంది.