ఫేక్ అకౌంట్స్ నడుపుతున్న భాస్కర్
జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో ఫుల్ కామెడీగా ఉంది. శాంతి స్వరూప్ పట్టు చీర కట్టుకుని వచ్చేసరికి రాంప్రసాద్ వెంటనే "శారీ మాత్రం చాలా బాగుందమ్మా" అన్నాడు. దాంతో "మా మావయ్య ఆయన చేతుల మీద పట్టు చీర కొట్టాడు. ఈ చీర కోసం 100 పట్టు పురుగులు చచ్చాయి" అన్నాడు. దాంతో దొరబాబు "ఈ పురుగు కోసం 100 పురుగులు చచ్చాయా" అంటూ శాంతి స్వరూప్ మీద సెటైర్ వేసాడు. ఇక ఫైనల్ లో బులెట్ భాస్కర్, ఫైమా స్కిట్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. "ఏవండీ ఈ రోజు నైట్ కి ములక్కాడ చారు చేయమంటారా, ములక్కాయ పులుసా " అని అడిగింది. "వద్దు, వద్దు, వద్దు" అన్నాడు భాస్కర్.