English | Telugu

సన్యాసం తీసుకుంటున్న బుల్లితెర నటి

బుల్లితెర మీద విష్ణుప్రియ కనిపిస్తే చాలు విపరీతమైన నవ్వు ముంచుకొస్తుంది. ఇక ఈమె జోడి ప్రిథ్వి శెట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఆడియన్స్ కి పండగే పండగా. అలాంటి విష్ణు ప్రియా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. "నీకు నచ్చే హజ్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి" అనేసరికి "ఈషా మెడిటేటర్ అయ్యి ఉండాలి..వేదాలు గురించి తెలిసి ఉండాలి, డాన్స్, సింగింగ్ వస్తే ఇంకా మంచిది, కుకింగ్ కూడా వచ్చి ఉండాలి, అట్లీస్ట్ బేసిక్స్ అన్నా అంటే అన్నం, పప్పు అన్నా చేయగలగాలి." అని చెప్పింది విష్ణు ప్రియా. ఇక హోస్ట్ ఐతే "వస్తాడా ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి" అని అడిగింది. "అంటే వస్తే చేసుకుంటా లేదంటే సన్యాసం పుచ్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను" అని చెప్పింది.