English | Telugu

బిగ్ బాస్ హౌస్ లో మేకప్ వేసుకోలేదు అంటున్న రమ్య మోక్ష

రమ్య మోక్ష అంటే తెలియకపోవచ్చు కానీ చిట్టి పికిల్స్ అంటే అందరికీ సుపరిచితమే. సోషల్ మీడియాలో ఈమె చాలా ఫేమస్. దాని కారణంగానే బిగ్ బాస్ సీజన్ 9 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చాలామంది ట్రోలింగ్ కూడా చేశారు. ఐతే ఇప్పుడు ఆమె ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. "నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడి నీరు వాతావరణం అస్సలు పడలేదు. పైగా  థైరాయిడ్ సమస్యలు కూడా ఉన్నాయి. వాటి కారణంగా నా చేతులు, మెడ, శరీరం మొత్తం మీద స్కిన్ ఇన్ఫెక్షన్స్, దద్దుర్లు రావడం మొదలుపెట్టాయి.

Bigg Boss 9 Telugu : భరణికి బిగ్ బాస్ సపోర్ట్.. శ్రీజకి మరోసారి అన్యాయం జరగనుందా!

బిగ్ బాస్ సీజన్-9 ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతోంది. అసలు ఎవరు ఊహించనిదే బిగ్ బాస్  చేస్తున్నాడు. అగ్నిపరీక్ష ద్వారా మొదటగా ఆరుగురు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించారు. అంతవరకు బానే ఉంది.. మళ్ళీ వాళ్ళని వరుసగా ఎలిమినేట్ చేసాడు. ఇప్పుడు కామనర్స్ లో ఎలిమినేట్ అయిన శ్రీజకి అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో తనకి మళ్ళీ రీఎంట్రీ ఉంటుందని బజ్ క్రియేట్ చేశారు. ఇక దీనితో పాటుగా అంతకుముందు వారం ఎలిమినేట్ అయిన భరణిని తీసుకొని వచ్చి ఇద్దరిలో ఎవరో ఒకరు పర్మినెంట్ హౌస్ మేట్  అని చెప్పాడు.

llu illalu pillalu : శోభ కోసం ఇద్దరు కోడళ్ళు వెతుకులాట.. వేదవతి వల్లే దొరికిపోయారుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్‌  'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-303 లో..... నర్మద, ప్రేమ, వేదవతి ముగ్గురు కలిసి శోభని కిడ్నాప్ చేసిన వాళ్ళని వెతకడానికి వెళ్తారు. వేదవతి తన తింగరి చేష్టలతో ఇద్దరు కోడళ్లకి చిరాకు తెప్పిస్తుంది. అసలు ఏమైంది అత్తయ్య.. నీ అత్త పోరు ఇంటికి వెళ్ళాక చూసుకుందాం కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉండమని నర్మద అంటుంది. మరొకవైపు శోభని కిడ్నాప్ చేసినవాడు.. తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఇంటికి ఎవరైనా వస్తే.‌‌ నా గురించి చెప్పకని చెప్తాడు. అప్పుడే అత్తాకోడళ్ళు కిడ్నాప్ చేసిన వాడి ఫ్రెండ్ ని చూసి అతనికి ఏమైనా తెలుసో కనుక్కుందామని వేదవతి అంటుంది. అలా డైరెక్ట్ గా ఎవరిని అడగొద్దని నర్మద అంటుంది.

మనం పన్నులు చెల్లించట్లేదు..అవినీతికి మూల్యం కడుతున్నాం

రేణు దేశాయ్ గురించి ఒక మంచి నటి మాత్రమే కాదు, ఒక మంచి తల్లి అలాగే ఎలాంటి సోషల్ కాజ్ కోసం ఐనా కానీ తన వంతు ప్రయత్నం చేయడంలో ముందుంటుంది. మూగ జీవాల కోసం ఆమె చాలా చేస్తూ ఉంటుంది. అలాంటి రేణు దేశాయ్ రీసెంట్ గా ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుంది. "ఎందుకు పాలిటిక్స్ లో ఉన్న మహిళలు, పురుషులు అలాగే ప్రభుత్వ రంగాల వాళ్ళు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ?ఇది 2025 ఐనా కానీ ఇప్పటికీ మనం సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సరైన రోడ్లు కానీ లేక అవస్థలు పడుతున్నాం..మనం కేవలం పన్నులు చెల్లించడం లేదు, అవినీతికి మూల్యం చెల్లిస్తున్నాము. " అంటూ పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైకి దగ్గరలో 250 కోట్లతో నిర్మించి ప్రారంభించిన కొన్ని రోజులకే రోడ్డు నాశనమవడం మీద ఆమె ఇలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రేణు దేశాయ్. వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు రోడ్లు బాలేని కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

సుమ అడ్డా లో సోనియా సీమంతం..

  సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోని కపుల్స్ స్పెషల్ ఎపిసోడ్ గా డిజైన్ చేశారు. ఈ షోకి మహేష్ - సాండ్రా, యష్-సోనియా, పవన్ కళ్యాణ్ - వాసంతి కృష్ణన్ వచ్చారు. ఇక ఈ షో ప్రోమో చూస్తే సోనియాకి సీమంతం ఎంతో ఘనంగా చేశారు. "ఒక పవర్ ఫుల్ అమ్మాయితో చేతుల మీదుగా ఇలా సీమంతం చేసుకోవడం బాగుంది. మీ బ్లేసింగ్స్ కావాలి. మీ లాగా నాకు పుట్టబోయే అమ్మాయి కూడా మీలా ఎన్నో అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. యష్ లాంటి  ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే సపోర్ట్ గా ఉంటే ఏ అమ్మాయైనా ఆకాశమంత ఎత్తు ఎదగొచ్చు, ఏదైనా సాధించొచ్చు కూడా. ఈ విషయాన్ని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను.

సుమ అడ్డా షోలో మహేష్-సాండ్రా పెళ్లి.. 

బుల్లితెర మీద మహేష్ కాళిదాసు - సాండ్రా గురించి అందరికీ తెలుసు. ఇక వీళ్ళ ప్రేమ, పెళ్లి గురించి తమ ఫాన్స్ అందరికీ కూడా చెప్పారు. ఐతే వీళ్ళు సుమ అడ్డా షోకి వచ్చారు. రీసెంట్ గా రిలీజయిన నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి వీళ్ళు రాబోతున్నారు. ఈ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. రాగానే సుమ వీళ్లకు ఒక గ్లాస్ లో డ్రింక్ పోసి రెండు స్ట్రాలు కూడా వేసి ఇచ్చింది. ముందు సాండ్రా ఆ డ్రింక్ తాగి ఇచ్చింది. "చూసారా ఇదే నా స్ట్రా.." అన్నాడు. దాంతో సుమ "అబ్బా అబ్బా" అంటూ ఒక లాంగ్ అండ్ ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఒక టాస్క్ లో "ఇంకా ప్రేమలో ఎం చేస్తారు అని అడిగేసరికి" "ఇంకేం చేస్తారు ముద్దులు పెట్టుకుంటారు " అని చెప్పాడు మహేష్. దాంతో ఒక్కసారిగా సుమా షాకయ్యింది. ఇక భార్యల్ని పిలిచి "కొత్త జంట అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి" అని సుమ అడిగేసరికి మహేష్ వెంటనే "ముద్దులు ముద్దులు" అని మళ్ళీ ఆన్సర్ చెప్పేసాడు.

Bigg Boss 9 Telugu : ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. గాయాలతో భరణి!

బిగ్ బాస్ సీజన్-9 లో అనుకోని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి దాకా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ అని, ఆ తర్వాత శ్రీజ ఎలిమినేషన్, భరణి ఎలిమినేషన్ జరిగాయి. ఆ తర్వాత బయటకొచ్చేసిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళి నామినేషన్ చేయడం అనేది మరో ట్విస్ట్. ఇలా రోజోక ట్విస్ట్ తో ఈ సీజన్-9 ముందుకు సాగిపోతుంది. ఇక శ్రీజ, భరణిలలో ఎవరు హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తారనేది ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది. ఇక వీరిద్దరికి బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తున్నాడు.  నిన్నటి ఎపిసోడ్ లో భరణి, శ్రీజల టీమ్ కి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో మొదటి రౌండ్ లో శ్రీజ టీమ్ విన్ అయింది. రెండో రౌండ్ కి అందరు ఒకరికొకరు లాక్ చేసుకొని ఎవరు బాక్స్ లో కాయిన్స్ పెట్టలేదు. దాంతో ఇద్దరిలో ఎవరికి పాయింట్స్ రాలేదు. అయితే ఈ రౌండ్ లో డీమాన్ పవన్ ని లాక్ చేసే క్రమంలో భరణి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడు.