English | Telugu
యంగ్‌టైగర్ ఎన్టీర్ హీరోగా, ఇలియానా హీరోయిన్గా, వైయజంతి మూవీస్ బ్యానర్‌పై మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "శక్తి'. ఈ చిత్రం ఆడియో వేడుక
సినిమా విడుదలకు ముందు ఏ సినిమానైనా సినీ పరిశ్రమలోని ప్రముఖులకు ప్రీమియర్ షో చూపించటం మామూలుగా ఆనవాయితీ.దానికి ఏ థియేటర్లోనో ఒక షో వేస్తూంటారు.కానీ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో ...
ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నాడు.ఈ చిత్రాన్ని తెలుగుతో సహా అన్ని దక్షిణాది భాషల్లో నిర్మించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా, సెల్వరాఘవన్ దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రం సోషియో ఫాంటసి చిత్రంగా రూపొందనుంది.
ప్రముఖ యువ హీరో అల్లు అర్జున్ వివాహం స్నేహా రెడ్డితో హైదరాబాద్ లోని హైటెక్స్ లో మార్చ్ 5 వ తేదీన జరుగనుంది. ఈ పెళ్ళికి ఏర్పాట్లలో అంటే షాపింగ్, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటు చేయించటం, వాటిని పంచటం, పెళ్ళి విందు ఏర్పాట్లు వగైరా వగైరాలతో ఇటు అల్లు అర్జున్ కుటుంబం, అటు స్నేహా రెడ్డి కుటుంబం యమ బిజిగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
ప్రముఖ యువ హీరో అల్లు అర్జున్ వివాహం స్నేహా రెడ్డితో హైదరాబాద్ లోని హైటెక్స్ లో 2011 మార్చ్ 5 వ తేదీన జరుగనుంది.ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల వివాహానికి, వారిని ఆశీర్వదించటానికి వస్తున్న టాలీవుడ్, కోలీవుడ్, వంటి దక్షిణాది సినీ ప్రముఖులతో పాటు హైదరాబాద్ కి రానున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.
ఆది ప్రముఖ సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు.వరుణ్ సందేశ్ వర్థమాన యువ హీరో.వీళ్ళిద్దరి మధ్య పాపం రామ్ గోపాల వర్మ తీసిన అప్పల్రాజు పచ్చడవుతాడని సినీ వర్గాల భోగట్టా.అంటే కె.విజయభాస్కర్ దర్శకత్వంలో,.అచ్చిరెడ్డి నిర్మిస్తుండగా,ఆది తొలిసారి హీరోగా నటిస్తున్న "ప్రేమ కావాలి"చిత్రం ఫిబ్రవరి 25 వ తేదీన విడుదలవుతోంది.
తమిళంలో విజయ్ హీరోగా, అనుష్క హీరోయిన్ గా,బాబూ శివన్ దర్శకత్వంలో నిర్మించబడిన "వేట్టై కారన్" అనే సినిమాని తెలుగులో "పులివేట" పేరుతో విడుదల చేయటానికి కళాదర్శకుడు యమ్ వి గోపాలరావు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో విడుదలై 70 కోట్ల భారీ మొత్తాన్ని వసూలు చేసింది.
సి యన్ ఆర్ క్రియేషన్స్ మరియూ మంత్ర ఎంటర్ టైన్ మెంట్స్ పతాకాలపై, ఛార్మి టైటిల్ పాత్రలో నటిస్తూండగా,ఓషో తులసీ రామ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం"మంగళ".
ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, ఆదిని హీరోగా పరిచయం చేస్తూ,కె.విజయభాస్కర్ దర్శకత్వంలో, కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం "ప్రేమ కావాలి".ఈ చిత్రమ పై సినీ పరిశ్రమలో అంచనాలు పెరుతున్నాయి.
ఆ అంటే బంద్ ఊ అంటే బంద్ అంటూ చేస్తున్న ఈ బందుల వల్ల జన జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది.ఈ బంద్ ల వల్ల రవాణా సౌకర్యాల్లేక అన్ని వ్యాపార సంస్థలూ, కార్యాలయాలు దాదాపు మూతపడ్డాయనే చెప్పొచ్చు.
"తీన్ మార్" అనే తెలుగు సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టెలివిజన్ సంస్థ అయిదున్నర కోట్ల ఫ్యాన్సీ మొత్తానికి సొంతం చేసుకుందట.పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో గణేష్ నిర్మిస్తున్న చిత్రం"తీన్ మార్".
శ్రీ శివపార్వతీ కంబైన్స్ పతాకంపై,మాస్టర్ హేమ చంద్రా రెడ్డి, బేబీ హేమశ్రీ సమర్పణలో, కృష్ణుడు హీరోగా, రితిక హీరోయిన్ గా, కె.రామ్ వెంకీని దర్శకుడిగా పరిచయం చేస్తూ,కె.సురేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం"నాకూ ఓ లవరుంది".
వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా,ఇలియానా హీరోయిన్ గా, "కంత్రీ, బిల్లా" చిత్రాల దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అశ్వనీదత్ నిర్మిస్తున్న భారీ చిత్రం "శక్తి".ఈ చిత్రం మొదలు పెట్టి ఇప్పటికి సరిగ్గా సంవత్సరం అయ్యింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రాబోయే "ముద్ర"చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో అమ్మరాజశేఖర్ కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.
అక్కినేని వంశ నట వారసుడు,ఆ వంశంలో మూడో తరం హీరో అయిన నాగచైతన్య వరసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు.మ్యాక్స్ ఇండియా పతాకంపై, ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో,దేవ కట్టా దర్శకత్వంలో, కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం"ఆటోనగర్ సూర్య".ఈ చిత్రం జూన్ లో ప్రారంభం కానుంది