English | Telugu

వెంకటేష్ "సావిత్రి" 40 కోట్లు

విక్టరీ వెంకటేష్ హీరోగా, తేజ దర్శకత్వంలో,సురేష్ ప్రొడక్షన్స్పతాకంపై, డి.సురేష్‍ బాబు "సావిత్రి" అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తూందని సమాచారం.ఈ చిత్రానికి నలభై కోట్ల రూపాయల భారీబడ్జెట్ ఖర్చవుతుందని సినీ వర్గాలంటున్నాయి.విక్టరీ వెంకటేష్ సినీ జీవితంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ "సావిత్రి" చిత్రాన్ని అభివర్ణించవచ్చు. ఈ చిత్రంలో హీరో వెంకటేష్ ఇదివరకెన్నడూ నటించని ఒక వైవిధ్యభరితమైన పాత్రలో నటించనున్నారని తెలిసింది.ఇటీవల విశాఖపట్టణంలోని రామానాయుడు స్టుడియోలో పూజా కార్యక్రమాలు మొదలైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 12 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.