English | Telugu

"ఎవరి కోసం ఈ పెళ్ళి"- హరీష్ శంకర్

ఒకరి ఆచారం; ఇంకొకరి ఆదాయం.కొందరు స్థిరపడ్డం ; కొందరు డిస్టర్బ్ అవ్వటం.ఓ తండ్రికి బరువు; ఓ అన్నయ్యకి బాధ్యత ఓ కుర్రాడి సర్వస్వం; ఓ అమ్మాయి స్వప్నం. ఓ తాతయ్య చివరి కోరిక ఓ బామ్మ చిరకాలపు దప్పిక. కొందరి అవివేకం; ఇంకొందరి ఆనందం కొందరు అడ్జస్ట్ అవ్వటం కొందరు అలవాటు పడ్డం కొందరు తృప్తి పడాలనుకోవటం కొందరు తొందరపడ్డాం అనుకోవటం ఒకరు ఉద్యోగం కోసం, ఒకరు పిల్లల కోసం, ఒకరు స్టేటస్ కోసం, ఇంకొకరు వంట మనిషి కోసం, కొందరికి జీవితం బోర్ కొట్టినందుకు, ఇంకొందరికి ఎవరో ఛీ కొట్టినందుకు, కొందరు ఇల్లు వదిలేయడానికి ఇంకొందరు, ఏకంగ దేశమే వదిలేయడానికి ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్ళి చేసుకోవటానికి ఉండే రకరకరల కారణాలెన్ని ఉన్నాయంటే, నిజానికి ఈ ప్రపంచంలో జరిగిన అన్ని పెళ్ళిళ్ళకంటే ఎక్కువగా ఈ కారణాలే ఉన్నాయని చెప్పాలి.

మన ఫ్రెండ్, అన్న, తమ్ముడు, నచ్చక పోతే మనం విడాకులు తీసుకోలేం, కానీ జీవిత భాగస్వామి నచ్చకపోతే విడాకులు తీసుకునే సౌకర్యం ఉన్న ఏకైక బలమైన (హీన) బంధం ఈ వివాహబంధం. సుమారు ఐదువేల సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగ కొన్ని కోట్లమంది కుల, మత, జాతి,ప్రాంత, లింగ, భేదాలకు అతీతంగా వివిధ రకాల దృక్పధాలతో ఆచరిస్తున్న ఏకైక శాస్త్రీయ సాంప్రదాయం ఈ పెళ్ళి. దీని మీద ఇంతమందికి ఇన్ని అభిప్రాయాలున్నపుడు, ఒక రచయతగా, ఒక దర్శకుడిగా నేను గమనించిన ఎందరో భర్తల సాక్షిగా, ఇంకందరో భార్యల సాక్షిగా నా అభిప్రాయమే ఈ“పెళ్ళి” ఎవరి కోసం? (P.S: Unity in diversity అనేది ఓ దేశానికి బాగుంటుందేమో కానీ ఓ కాపురానికి ఛండాలంగ ఉంటుంది). పెళ్ళంటే ఇది హరీష్ శంకర్ అభిప్రాయం. ఇలాంటి అభిప్రాయాలతో వీళ్ళు తీయబోయే "పెళ్ళి" అనే చిత్రం ఏ విధంగా అఘోరిస్తుందో ఊహించవచ్చు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.