పూరి జగన్నాథ్... మేడ్ ఫర్ కమర్షియల్ సి
పూరి కూడా అచ్చంగా ఇలానే అనుకొన్నాడు. ఓ రాఘవేంద్రరావులానో, దాసరి లానో సినిమా తీయాలనుకోలేదు. రెండో వర్మనో, మూడో కోదండరామిరెడ్డినో అనిపించుకోవాలని రాలేదు. మొదటి పూరిలా పేరు తెచ్చుకొందామనుకొన్నాడు. తనదంటూ ఓ స్టైల్ జోడించి... ''ఇది పూరి సినిమా'' అంటూ ఓ జెండా రెపరెపలాడేలా చేద్దామనుకొన్నాడు.. చేశాడు.