English | Telugu

గోవిందా..? ఈ ''చిరు'' కెలుకుడేందిరా?

రామ్‌చ‌ర‌ణ్ సినిమాకెప్పుడూ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు. ఒక‌టి వ‌ర్జిన‌ల్ ద‌ర్శ‌కుడైతే... మ‌రోక‌రు తెర‌వెనుక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంటారు. ఆయ‌నెవ‌రో తెలుసా...?? చిరంజీవి. య‌స్‌... కొడుకు సినిమా అన‌గానే ఎక్క‌డ‌లేని ప్రేమ, అజ‌మాయిషీ చూపించేస్తుంటారు చిరు. క‌థేంటి? హీరోయిన్‌గా ఎవ‌ర్ని తీసుకొంటున్నారు? పాట‌లు ఎక్క‌డ తీస్తున్నారు..?? ఇలా ప్ర‌తీ విష‌యంలోనూ ఆయ‌న ప్ర‌శ్న‌లు సంధిస్తుంటారు. అక్క‌డితో ఆగుతారా?? ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర కూర్చుని, ఈ సీన్ ఇలా ఎందుకు తీశారు? అది మార్చండి, ఇది చేర్చండంటూ స‌వాల‌క్ష స‌ల‌హాలు, ఆర్డ‌ర్లు. రామ్‌చ‌ర‌ణ్ తాజా చిత్రం గోవిందుడు అంద‌రివాడేలేకీ ఇది త‌ప్ప‌లేదు. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఈ సినిమాని కెలికేసిన చిరంజీవి విడుద‌ల‌కు ముందు కూడా... ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ని క‌త్తెర్లు పట్టుకొని ప‌ర ప‌ర కోసి ప‌డేశాడ‌ని టాక్‌.

గోవిందుడు సినిమాకి ఆల్రెడీ రీషూట్ జ‌రిగింది. దానికి కార‌ణం చిరంజీవినే. ఈ సినిమా ఎలాగొచ్చిందో చూడండి అని కృష్ణ‌వంశీ అడిగిన పాపానికి... ఈ సినిమా చూసి పెద‌వి విరిచాడు చిరు. స‌న్నివేశాలనే కాదు.. ఏకంగా కొన్ని పాత్ర‌ల‌నే క‌త్తిరించేశాడు. దాంతో రాజ్‌కిర‌ణ్ వెళ్లి ప్ర‌కాష్‌రాజ్ వ‌చ్చాడు. ఇందుకు నిర్మాత చెల్లించిన మూల్యం అక్ష‌రాలా.. రూ.5 కోట్లు. స‌రే.. ప్ర‌కాష్‌రాజ్ వ‌చ్చాడు. అయినా చిరు అనుమానాలు తీర‌లేదు. వీలున్న‌ప్పుడ‌ల్లా సినిమాని చెక్ చేస్తూ త‌న వంతు మార్ప‌లు చెప్పాడు. ఈ త‌తంగం సెన్సార్ ముందు వ‌ర‌కూ జ‌రుగుతూనే ఉంది. ఇప్పుడు చివ‌రి క్ష‌ణాల్లో కూడా చిరు బాగా ఇన్‌వాల్వ్ అవుతున్నాడ‌ట‌. ఈ సినిమాలో సెకండాప్ హెవీగా ఉంద‌ని రిపోర్టు వ‌స్తున్నాయి. దాంతో చిరులో కంగారు మొద‌లైంది. అంత హెవీగా ఉంటే చూస్తారా?? అనుకొని మ‌ళ్లీ క‌త్తెర్ల‌కు ప‌ని చెప్పాడ‌ట‌. చివ‌రి క్ష‌ణాల్లో రెండు మూడు సీన్లు లేపేశాడ‌ని తెలుస్తోంది. అంతేకాదు... సుదీర్ఘంగా సాగిన స‌న్నివేశాల్ని చిరు ద‌గ్గ‌రుండి మ‌రీ ట్రిమ్ చేశాడ‌ట‌. చిరు అతి జోక్యం అటు కృష్ణ‌వంశీకి బొత్తిగా న‌చ్చ‌డం లేద‌ట‌. చిరుని ఏమ‌న‌లేక‌, మౌనంగానే భ‌రిస్తున్నాడ‌ట‌. ఒక‌వేళ గోవిందుడు ఫ్లాప్ అయితే... అప్పుడు కృష్ఱ‌వంశీ బ‌ర‌స్ట్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న స‌న్నిహితులే జోస్యం చెబుతున్నారు. కొడుకు సినిమా అంటే జాగ్ర‌త్త ప‌డాల్సిందే. మ‌రీ ఇంత అతిజాగ్ర‌త్త ప‌నికిరాద‌ని చిరుకి ఎప్పుడు అర్థ‌మ‌వుతుందో ఏంటో..?

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.