English | Telugu

సంపూని ‘సింగం123’ చేసిన మంచు విష్ణు

‘హృదయకాలేయం’ చిత్రంతో సంచలన విజయం సొంతం చేసుకోవడమే కాకుండా.. ప్రపంచవాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న కథానాయకుడు సంపూర్ణేష్‌బాబు. అభిమానులు ముద్దుగా ‘సంపూ’ అని పిలుచుకొనే సంపూర్ణేష్‌బాబు కథానాయకుడిగా మంచు విష్ణు ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. అక్షత్‌శర్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రిప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంపూర్ణేష్‌బాబు అభిమానులతోపాటు యావత్‌ సినీ అభిమానులను అలరించేలా ‘సింగం 123’ రూపొందనుంది. ‘హృదయకాలేయం’ చిత్రాన్ని మించిని కామెడీ, సెంటిమెంట్‌, లవ్‌ అండ్‌ ఎఫెక్షన్‌ ‘సింగం 123’ చిత్రంలో ఉంటాయి. ‘సింగం 123’లో సంపూ ఏ విధంగా ఉండబోతున్నాడో తెలియజేయడం కోసం నేడు ఈ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని చిత్ర బృందం తెలిపింది.ఇకపోతే.. 24 ఫ్రేమ్స్‌ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న మరో చిత్రం ‘కరెంట్‌ తీగ’ అక్టోబర్‌ 17న విడుదల కానుంది!