English | Telugu

టాలీవుడ్‌లో బినామీ కింగ్ ఎవ‌రు?

క్యాష్ ఒక‌డిది.... టైటిల్ కార్డ్ ఒక‌డిది అంటే ఇదే..! టాలీవుడ్ లో బినామీలు మామూలే. ఒక‌రి పేరు మీద మ‌రొక‌రు సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు మ‌రో భారీ బినామీ కింగ్ వ‌చ్చాడు. క‌మెడియ‌న్‌గా కోట్లు వెన‌కేసిన ఓ న‌టుడు.. ఇప్పుడు బినామీల‌కు డ‌బ్బులిచ్చి సినిమాలు తీయిస్తున్నాడ‌ని టాక్‌. రోజుల లెక్క‌న పారితోషికం తీసుకొనే ఓ స్టార్ క‌మెడియ‌న్ ఇప్పుడు త‌న డ‌బ్బుని అప్పుగా ఇచ్చి, భారీ వ‌డ్డీలు వ‌సూలు చేసి బినామీ కింగ్‌గా ఎదుగుతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ్‌. సినిమా ఫ్లాప్ అయినా, హిట్ట‌యినా త‌న‌కు సంబంధం లేద‌ట‌. త‌న‌కు రావాల్సిన అస‌లుని వ‌డ్డీతో స‌హా అప్ప‌గిస్తే చాల‌ట‌. ఈ రూపంలో ఇండ్ర‌స్ట్రీలో దాదాపు రూ.70 కోట్లు అప్పుగా ఇచ్చాడ‌ని, స‌ద‌రు క‌మెడియ‌న్ అప్పుగా ఇచ్చిన సినిమాలు కొన్ని సూప‌ర్ హిట్ అయ్యాయ‌ని... దాంతో మ‌నోడిది ల‌క్కీ హ్యాండ్ అనుకొని డ‌బ్బులు తీసుకోవ‌డానికి జ‌నం ముందుకొస్తున్నార‌ని తెలిసింది. అయితే వ‌డ్డీ విష‌యంలో ఇత‌గాడు చాలా ప‌క్క‌గా ఉంటాడ‌ట‌. బ‌య‌ట ఫైనాన్సియర్ల ద‌గ్గ‌ర తీసుకొనే వ‌డ్డీ కంటే.. ఛార్జ్ కాస్త ఎక్కువ‌గానే వ‌సూలు చేస్తాడ‌ని తెలిసింది. అంతేకాదు... డ‌బ్బులు వసూలు చేయించ‌గ‌ల కెపాసిటీ ఈ క‌మెడియ‌న్ ద‌గ్గ‌ర కావ‌ల్సినంత ఉంద‌ట‌. పెద్ద పెద్ద త‌ల‌కాయ‌ల అండ‌దండ‌తో బినామీకింగ్‌గా ఎదుగుతున్న ఆ క‌మెడియ‌న్ ఎవ‌రో మీకేమైనా క్లూ దొరికిందా..??

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.