English | Telugu

Brahmamudi : కోమాలోకి వెళ్లిన అపర్ణ.. కావ్యను ఇంట్లో నుండి గెంటేయ్ రాజ్

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -510 లో.... అపర్ణ ఎప్పటిలాగే టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకుంటుంది. మరొకవైపు ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుందని ఫోన్ వచ్చిందని కావ్య ఆఫీస్ కి వెళ్లి అక్కడ మేనేజర్ ని అడుగుతుంది. మేం ఏం చెయ్యలేదని అతను చెప్పగానే తనకి వచ్చిన నెంబర్ కి కాల్ చేస్తుంది. ఫోన్ కలవదు ఒకసారి అన్ని ఫైల్స్ చెక్ చెయ్యాలని కావ్య అంటుంది. మరోకవైపు అపర్ణకి బీపీ ఎక్కువ అవుతుంది. దాంతో కావ్యకి ఫోన్ చేస్తుంది. తను లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత అంత బాధలో కూడ రాజ్ కి చేసి నాకు ఇబ్బందిగా ఉంది రా త్వరగా అంటూ చెప్తుంది.