English | Telugu

Shekhar basha: శేఖర్ బాషాకి బాబు పుట్టాడు.. హౌస్ లో గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్!

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ ఎపిసోడ్ లో ఒక్కొక్కరిని రఫ్ఫాడించాడు నాగార్జున. హౌస్ లో వీకంతా ఎవరెవరు ఏం చేసారో చెప్తూ గట్టిగా క్లాస్ పీకాడు. అయితే వీటిల్లో ఓ గుడ్ న్యూస్ అండ్ సర్ ప్రైజ్ కూడా చెప్పాడు నాగార్జున. (Bigg Boss 8 Telugu)

ఇలాంటి సర్ ప్రైజ్ లు సర్వ సాధారణం.. ప్రతీ సీజన్లో ఇలాంటి ఒక ఎమోషన్ ఉండనే ఉంటుంది. గత సీజన్ 6 లో సింగర్ రేవంత్ భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అతను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు బయట తన వైఫ్ ఎలా ఉందోనంటూ రేవంత్ ఒక ఎమోషన్ ని క్యారీ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత తనకి పాప పుట్టిందంటూ బిగ్ బాస్ రేవంత్ కి గుడ్ న్యూస్ షేర్ చేసాడు. ఆ సీన్ మోస్ట్ హార్ట్ టచింగ్ అని చెప్పొచ్చు. (Shekar Basha)

గత సీజన్లో కూడ అంబటి అర్జున్ కూడా అదే ఎమోషన్ క్యారీ చేస్తూ వచ్చాడు‌ ప్రస్తుతం హౌస్ లో శేఖర్ బాషా కూడా అదే ఎమోషన్ ని క్యారీ చేస్తున్నాడు‌. కానీ బయటపడడం లేదు. అతని భార్యకి డెలివరీ డేట్ సెప్టెంబర్ 14 కావడంతో శేఖర్ బాషా ప్రొద్దున నుండి నాగార్జున సర్ ఎప్పుడు వస్తారు.. ఏదైనా న్యూస్ చెప్తారేమోనని వెయిట్ చేస్తున్నానంటు నాగార్జునతో శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు. శేఖర్ కోసం బిగ్ బాస్ ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చాను. నీకు బాబు పుట్టాడని నాగార్జున చెప్పగానే శేఖర్ బాషా ఏడుస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సీజన్ లో ఇదే మోస్ట్ ఎమోషనల్ సీన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత అందరు శేఖర్ బాషాకి కంగ్రాట్స్ చెప్పారు. దాంతో తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.