English | Telugu

Bigg Boss 8 Telugu: అన్ని రికార్డులు బ్రేక్ చేసిన బిగ్ బాస్ సీజన్ 8.. హౌస్ లో ఏం జరిగిందంటే!

బిగ్ బాస్ సీజన్ 8 లో సెకెండ్ వీకెండ్ వచ్చేసింది. నిన్న అనగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ నామినేషన్ పాయింట్స్ తో కూడిన సాంగ్ తో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హిస్టరీ లోనే ఇది రికార్డు అంటు ఓ విషయం చెప్పాడు. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజెస్ కలిపి అన్ బిలేబుల్, అన్ బ్రేకెబుల్ సిక్స్ బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మన బిగ్ బాస్ సీజన్ 8 సాధించింది అంటు తన హ్యాపీ నెస్ ని షేర్ చేసుకున్నాడు నాగార్జున. ఇప్పటి వరకు జరిగిన తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్లని క్రాస్ చెయ్యడమే కాదు.. ఆల్ ఓవర్ ఇండియాలోని అన్ని బిగ్ బాస్ సీజన్ ల టీఆర్పీని కూడా బ్రేక్ చేసిందంటు నాగార్జున చెప్పాడు.

ఇక శుక్రవారం జరిగిన ప్రమోషన్ టాస్క్ ని బిగ్ స్క్రీన్ మీద చూపించాడు. మణికంఠ వేరొక టీమ్ నుండి కారం పొడి దొంగతనం చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తాడు. దాంతో విష్షుప్రియ తనపై కోప్పడుతుంది. నువ్వు దొంగతనం చేసావని చెప్పాలి కదా.. మళ్ళీ ఎందుకు తిరిగి ఇవ్వడమంటూ చిన్న ఆర్గుమెంట్ జరుగుతుంది. మన పర్ స్పెక్టివ్ స్టర్ విష్ణు మప్రియని కూల్ చెయ్యాలని ట్రై చేస్తాడు. ఇదంతా బిగ్ స్క్రీన్ మీద అందరు చూసేస్తారు. ఇక హౌస్ లో మూడు క్లాన్ లు ఉన్న విషయం అందరికి తెలిసిందే. మూడు క్లాన్ లు ఉన్నా టీమ్ లలోని తమ క్లాన్ సభ్యుల పర్ఫామెన్స్ బాగుంటే గ్రీన్ లో... బాగోకపోతే రెడ్ లో పెట్టాలని నాగార్జున చెప్పగా.. ముందుగా యష్మీ తన క్లాన్ మెంబర్స్ అయిన అభయ్, పృథ్వీలని గ్రీన్ లోను శేఖర్ బాషా, ప్రేరణ, సోనియాలని రెడ్ లో పెడుతుంది. ఆ తర్వాత నైనిక క్లాన్ లో నబీల్, విష్ణుప్రియ, సీతలని గ్రీన్ లో ఆదిత్య ఓమ్ లని రెడ్ లో పెడుతుంది. ఇక నిఖిల్ తన క్లాన్ మెంబెర్ ఒక్కడే మణికంఠ ఉండడంతో ఆతని పర్ఫామెన్స్ బాగుందని గ్రీన్ లో పెడతాడు.

హౌస్ మేట్స్ ల్ ఉన్న చిన్నచిన్న మిస్ అండర్ స్టాండింగ్స్ ని క్లారిఫికేషన్ చేసి అందరికి చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాడు నాగార్జున. సోనియా నామినేషన్ లో విష్ణుప్రియని ఫ్యామిలీ పరంగా అన్నదాని గురించి క్లారిటీగా సీసీటీవీ ఫుటేజ్ వేసి చూపించాడు‌ నాగార్జున. నీకు చూసేవాళ్ళు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ మాకు చూస్తారన్నావ్ అలా అనడం కరెక్టా అని నాగార్జున అడుగగా.. సోనియా సారీ చెప్తుంది. ఇకముందు అలా మాట్లాడితే ప్రేక్షకులు ఏం చేస్తారో తెలుసు కదా అంటు సోనియాకి వార్నింగ్ ఇచ్చాడు. ఇక పృథ్వీ చాలాసార్లు ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావ్.. టంగ్ స్లిప్ అవుతున్నావ్.. ఇంకొకసారి అలా అయితే అంటూ గన్ చూపిస్తాడు నాగార్జున. యష్మీ మణికంఠ విషయంలో ఉన్న ఇష్యూని వీడియో ఫుటేజ్ లో వేసి చూపించగా యష్మీనే తప్పు అని చూపించగా మాట్లాడేలేక ఎమోషనల్ అవుతుంది. ఇలా ఒక్కొక్కరి గురించి ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేసినట్టే చురకలు అంటించాడు నాగార్జున. బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన నబీల్, సీతలకి గ్రీన్ బ్యాండ్ ఇచ్చాడు నాగార్జున.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.