English | Telugu

శ్రీముఖి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా...నా లక్కీ హీరోయిన్!

ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ ప్రోమో మాత్రం కేక పుట్టిస్తోంది. ఎందుకంటే గుప్పెడంత మనసు సీరియల్ టీమ్ ఇక్కడికి వచ్చింది. వీళ్లకు ఫేర్ వెల్ పార్టీ ఇచ్చింది శ్రీముఖి అండ్ టీమ్. ఇక ఈ టైములో రిషి అంటే గర్ల్స్ కి వసు అంటే బాయ్స్ పిచ్చ ఫాన్స్ అని స్రేముఖి చెప్పింది. అలాగే రిషి దగ్గర నుంచి ఒక ప్రామిస్ తీసుకుంది శ్రీముఖి. "గుప్పెడంత మనసు ఐపోయింది అని కాకుండా నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని మాటివ్వు" అని అడిగింది. "బ్రహ్మముడి ఆర్టిస్టుల కన్నా నేనే ఎక్కువగా డేట్స్ ఇస్తా" అని చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేసాడు రిషి. ఇక ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా రిషి సీరియల్ మదర్ జగతి వచ్చింది.