English | Telugu

Karthika Deepam2 : పెళ్ళి చేసుకొని వచ్చిన స్వప్న, కాశీ.. నాన్నని పిలిపించమని పెద్దాయాన ఆర్డర్

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -160 లో.....స్వప్న, కాశీ లు కార్తీక్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. స్వప్నని జాగ్రత్త గా చూసుకో నిన్ను నమ్మి వచ్చిందని కార్తీక్ అనగానే.. ప్రాణం పోయినా చెయ్ వదలనని చెప్పి కాశీ స్వప్నని తీసుకొని వెళ్తాడు. దీప మాతో పాటురా అని కాంచన  అంటుంది. అందరి పెళ్లి చేస్తుంది. నా పెళ్లి చేయదా అని కార్తీక్ వెటకారంగా మాట్లాడతాడు. మరొకవైపు శ్రీధర్ కి స్వప్న ఫోన్ చేసి.. నేను క్షేమంగా ఉన్నాను.. మీరు టెన్షన్ పడకండి.. ఈవినింగ్ వచ్చాక మాట్లాడతాను.. నేను కనపడడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తారని కాల్ చేస్తున్నాను.. ఈవినింగ్ వస్తానని కాల్ కట్ చేస్తుంది స్వప్న.

Eto Vellipoyindhi Manasu : వాళ్ళిద్దరి ప్రేమకి మధ్యలో శ్రీలత.. ఆమె డ్రీమ్ నెరవేరుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -211 లో.....పేపర్స్ పట్టుకోబోతుంటే రామలక్ష్మి అనుకోకుండా సీతాకాంత్ కి ముద్దు పెడుతుంది.. నీకు పెడతానని సీతాకంత్ అనగానే.. ముందు పని చూసుకోండి. బోలెడంత కాంపిటీషన్ ఉంది బయట అని అంటుంది. దాంతో సీతాకాంత్ బిట్ వెయ్యడని కొటేషన్ రెడీ చేస్తుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు నిద్రపోతుంటే.. అప్పుడే శ్రీవల్లి మెల్లిగా గదిలోకి వస్తుంది. సీతాకాంత్ రెడీ చేసిన కొటేషన్ ఎక్కడ ఉందని వెతుకుతుంది.

Brahmamudi : కావ్యకి గుడ్ న్యూస్.. అప్పు పోలీస్ జాబ్ తెచ్చుకోగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -525 లో....సీతారామయ్య ఫ్రెండ్ తన ఇంటికి వస్తాడు. ఇన్ని రోజులాగా మీ కంపెనీతో నా మనవడు కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. ఇక ఆ కాంట్రాక్టు కాన్సిల్ చేసుకున్నాడని అతను చెప్తాడు. ఎందుకు ఏమైంది అని సీతారామయ్య అంటాడు. మర్యాద తక్కువ అయింది.. నా మనవడిని రాహుల్ అవమానించాట అని అతను చెప్తాడు. ఇన్ని రోజుల నుండి మన మధ్య స్నేహం ఉంది కాబట్టి ఆ విషయం చెప్పాడనికి వచ్చానని అతను అనగానే చాలా థాంక్స్ రా ఇప్పటికైనా మా కంపెనీలో ఏం జరుగుతుందో తెలియజేశావని సీతారామయ్య అంటాడు. 

Karthika Deepam2 : వాళ్ళిద్దరి పెళ్లి చేసిన దీప.. షాక్ లో కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -159 లో.... శ్రీధర్ ని దీప లోపలికి రాకుండా చేసి.. స్వప్న, శ్రీకాంత్ ల పెళ్లి ఆగిపోయేలా చేస్తుంది. పెళ్లి కొడుకు అమ్మాయి పోయే ఆస్తి పోయే అంటూ అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళండి అని దీప అనగానే.. ఇప్పుడు మా డాడ్ ని ఎలా ఆపారో తెలియదు కానీ ఆపారు.. కానీ ఇప్పుడు కాకపోయినా మళ్ళీ నాకు పెళ్లి చేస్తాడని స్వప్న అనగానే.. ఇప్పుడు మా పెళ్లి చేస్తేనే దీనికి సొల్యూషన్ అని కాశీ అంటాడు. దాంతో దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత మాకు ఇప్పుడు పెళ్లి చెయ్యండి అంటూ దీపని ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు.

Eto Vellipoyindhi Manasu : అనుకోకుండా ముద్దు పెట్టుకున్న భార్య.‌. ఆ ప్రాజెక్ట్ ఎవరికంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -210 లో.....కంపెనీ బోర్డు మెంబర్ శ్రీలత వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. మొన్న మనం అనుకున్న ప్రాజెక్ట్ కి రేపే బిట్ వేస్తున్నారు. సీతాకాంత్ కీ కాకుండా వేరే వాళ్లకు బిట్ వచ్చేలా చేస్తే మనకి టెన్ పర్సంట్ కమిషన్ ఇస్తానని అన్నారని అతను చెప్తాడు. సీతాకాంత్ బిట్ వెయ్యడానికి వెళ్తే కచ్చితంగా ఆ బిట్ తనకి వస్తుందని అతను అంటాడు. తను రాకుండా నేను చూస్తాను కదా అని శ్రీలత అంటుంది. వాళ్ళ మాటలన్నీ దూరం నుండి రామలక్ష్మి వింటుంది. మీ ప్లాన్ లో మీరు ఉన్నారు.. నా ప్లాన్ లో నేను ఉంటానని రామలక్ష్మి అనుకుంటుంది.