ఈ దేశంలో రిగ్గింగ్ నేరం కానీ బెగ్గింగ్ నేరం కాదు
ఈ శుక్రవారం శనివారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో స్కిట్ ఒక్కోలా ఎంటర్టైన్ చేసింది. ఇందులో రౌడీ రోహిణి బాగా నవ్వించింది. ఇందులో రోహిణి బెగ్గింగ్ రోల్ లో నటించింది. బెగ్గింగ్ కోచింగ్ సెంటర్ పెట్టి అందులో అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఈ కోచింగ్ సెంటర్ కి ఆటో రాంప్రసాద్, దొరబాబు ఇద్దరూ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చారు. "మాకు జాబ్ లు ఇస్తామని చెప్పింది బెగ్గర్స్ గానేనా" అని ఆటో రాంప్రసాద్ అడిగేసరికి "అవును బెగ్గింగ్ కోసమే" అని చెప్పింది రోహిణి.