తేజస్వి హీరోయిన్ గా ‘జత కలిసే’
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, హార్ట్ ఎటాక్, ఐస్ క్రీమ్, లవర్స్, అనుక్షణం, కేరింత’ వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్న తెలుగమ్మాయి తేజస్వి హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతోంది.. నూతన నిర్మాణ సంస్థ యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘జత కలిసే’ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఆశ్విన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘అలామొదలైంది’ ఫేమ్ స్నిగ్ధ ఓ ప్రధానపాత్రలో నటించింది.