English | Telugu
'భలే భలే' నాని లక్ మారింది
Updated : Sep 5, 2015
యంగ్ హీరో నాని ఇండస్ట్రీ కి వచ్చి 7 ఏళ్ళు గడిచిన కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలు మాత్రమే మూడే అవి ఈగ, అలా మొదలైంది, పిల్ల జమిందార్ వీటి తర్వాత నాని ఒక్క సినిమా కూడా కలిసిరాలేదు , ఎన్ని ప్రయోగాలూ చేసిన బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు..ఇక నాని పని అయిపొయింది అనుకున్న టైం లో నాని కి దేవుడి లా ఆదుకున్నాడు యూత్ డైరెక్టర్ మారుతీ. భలే భలే మగాడివోయ్ సినిమా తో నాని దశ మారిపోయిందని విమర్శకులతో పాటు ఇటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటివరకు నాని కెరియర్ లో చెయ్యని కొత్త పాత్రలో కనిపించడమే కాదు ఆ పాత్ర కు ప్రాణం పోసాడని , కామెడీ లో కూడా మంచి టైమింగ్ చూపించాడని సినిమా చూసిన ప్రేక్షకులు చెపుతున్నారు. అలాగే భలే భలే మగాడివోయ్ మొదటిరోజు కలెక్షన్స్ విషయం లో కూడా ది బెస్ట్ అనే చెపుతున్నారు. మొత్తానికి నాని ని తీరిగి ఇండస్ట్రీ లో నిలబెట్టాడు మారుతీ.