English | Telugu

నిఖిల్‌కి రిటన్ గిప్ట్ ఇచ్చిన అభయ్ నవీన్!

బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మూడో ఎలిమినేషన్ గా అభయ్ నవీన్ బయటకొచ్చాడు.‌ అభయ్ బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేశాడు.‌

నిఖిల్, సోనియా, పృథ్వీల గురించి యాంకర్ అడుగగా.. వాళ్ళ ముగ్గురి మధ్య బాండింగ్ ఏర్పడింది. నిఖిల్ కాస్త ఆలోచిస్తున్నాడు కానీ పృథ్వీ పూర్తిగా సోనియా మాట వింటున్నాడని చెప్పాడు. ఇక సోనియా చెప్పిందే వాళ్ళిద్దరు వినాలని చూస్తుందని కూడా అభయ్ చెప్పాడు. ఇక సోనియా ఫేకా రియలా అని యాంకర్ అడుగగా.. తను డెబ్బై శాతం రియల్.. ముప్పై శాతం ఫేక్ అని అభయ్ చెప్పాడు. ప్రతీ టాస్క్ లో సోనియా వాళ్ళిద్దరిని వాడుకుంటుందని అందరికి అర్థమైంది. అదే విషయాన్ని అభయ్ తన స్టైల్లో చెప్పాడు. 'అరెయ్ సోనియా వల్ల నీ గేమ్ డిస్టబ్ అవుతుంది చూసుకోరా' అని నిఖిల్ కి అభయ్ చెప్పాడంట. ఇక బజ్ లో విన్నింగ్ లక్షణాలు ఎవరికి ఉన్నాయి.. అసలు హౌస్ లో ఉన్నవాళ్ళ గురించి చెప్పమని యాంకర్ అనగా.. ఒక్కో కంటెస్టెంట్ గురించి అభయ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్నవాళ్ళలో నబీల్ కి విన్నర్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయని అన్నాడు.

ఇక ప్రేరణ గేమ్ గురించి టెన్షన్ పడుతుందని, బిగ్ బాస్ టాస్క్ చెప్పకముందే, ఎలా ఆడాలి.. ఏం చేయాలని ఆలోచిస్తుంటుంది. తీరా గేమ్ మొదలయ్యాక మాములు అవుతుందని అభయ్ అన్నాడు. ‌ఇక సీత ఏడుపు వెనుక ఉన్న నిజం చెప్పాడు. బేబక్క వెళ్తుంటే ఎందుకు ఏడ్చినవ్ అని సీతని అభయ్ అడిగితే.‌ రేపు నేను కూడా ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్తా కదా అని చెప్పిందంట‌. మరి నువ్వు వస్తుంటే కూడా ఏడ్చింది కదా అని యాంకర్ అనగానే.. అలా ఏం లేదు.‌ తను నన్ను అన్నయ్య అంది.. అందుకే బయటకొచ్చాక రాఖీ కట్టించుకుంటా అని చెప్పా అని అభయ్ అన్నాడు. ఇక హౌస్ లో ఆదిత్య ఓం, మణికంఠ, నైనిక, విష్ణుప్రియల గురించి అభయ్ చెప్పుకొచ్చాడు. తనేం చెప్పాడో తెలియాలంటే స్టార్ మా యూట్యూబ్ ఛానెల్ లోని ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.