English | Telugu

ఫ్యామిలీతో కలిసి జానీ మాస్టర్ దీపావళి సెలబ్రేషన్స్.. ఇండస్ట్రీ షేక్ ఐపోవాలి

జీవితం అన్నాక అన్ని సందర్భాల్లో ఒక్కలాగే ఉండదు. గుక్క తిప్పుకోనివ్వని అదృష్టం ఉంటుంది కోలుకోలేని కష్టము ఉంటుంది. కానీ ఏది వచ్చినా తట్టుకున్న వాడు  ఎప్పటికీ ఓడిపోడు అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాష్టర్ విషయంలో అదే జరిగింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాష్టర్  జైలు నుంచి అక్టోబర్ 25 న చంచ‌ల్‌గూడ‌ జైలు నుంచి బయటకు వచ్చాడు. జానీ మాష్టర్ లైఫ్ లో  ఇదొక చీకటి కోణం అని చెప్పొచ్చు..నిజం ఎంతో, అబద్దం ఎంతో తెలీకపోయినా జైలు నుంచి బయటకు వచ్చి ఇప్పుడు తన కుటుంబంతో దీపావళి సెలెబ్రేట్ చేసుకున్నాడు. "ఈ పండుగ నాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచా లాంటి చిరునవ్వులు, మిఠాయిల్లాంటి మధురమైన క్షణాలు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి." అంటూ విషెస్ మెసేజ్ పెట్టాడు.

Brahmamudi : కావ్య దెబ్బకి అనామిక బేజారు.. పాపం సామంత్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -556 లో.....కావ్య వేళంపాట వదిలేస్తుంది. వేళంపాటలో అరవింద్ కంపెనీని అనామిక దక్కించుకుంటుంది. గర్వంతో కావ్య వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఈ అనామికతో కావ్య చేతులు కలిపిందని రుద్రాణి అనగానే.. ఒక్క నిమిషం ఆగండీ.. ఎవరు చేతులు కలిపారో అర్ధం అవుతుందని కావ్య అంటుంది. అప్పుడే సామంత్ వస్తాడు. ఇంకా వేళంపాట స్టార్ట్ అవ్వలేదా.. థాంక్ గాడ్ అని అంటాడు. అయిపోయింది కూడా అని అనామిక అనగానే.. ఎంత పని చేసావ్.. ఆ కంపెనీ విలువ అయిదు కోట్ల మాత్రమే.. ఇంకా ఆ కంపెనీ అప్పుల్లో ఉందని సామంత్ అనగానే. అందరు షాక్ అవుతారు.