English | Telugu
Brahmamudi : కావ్య దెబ్బకి అనామిక బేజారు.. పాపం సామంత్!
Updated : Nov 2, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -556 లో.....కావ్య వేళంపాట వదిలేస్తుంది. వేళంపాటలో అరవింద్ కంపెనీని అనామిక దక్కించుకుంటుంది. గర్వంతో కావ్య వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఈ అనామికతో కావ్య చేతులు కలిపిందని రుద్రాణి అనగానే.. ఒక్క నిమిషం ఆగండీ.. ఎవరు చేతులు కలిపారో అర్ధం అవుతుందని కావ్య అంటుంది. అప్పుడే సామంత్ వస్తాడు. ఇంకా వేళంపాట స్టార్ట్ అవ్వలేదా.. థాంక్ గాడ్ అని అంటాడు. అయిపోయింది కూడా అని అనామిక అనగానే.. ఎంత పని చేసావ్.. ఆ కంపెనీ విలువ అయిదు కోట్ల మాత్రమే.. ఇంకా ఆ కంపెనీ అప్పుల్లో ఉందని సామంత్ అనగానే. అందరు షాక్ అవుతారు.
ఆ తర్వాత అరవింద్ వచ్చి.. థాంక్స్ మేడమ్ అయిదు కోట్లు కూడా పలకని కంపెనీని నలభై కోట్లకి చేశారు. మీకు చాలా తెలివి ఉంది. మన డీలింగ్ ప్రకారం మీ లాభమంటు కావ్యకి అరవింద్ చెక్ ఇస్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. దానితో ఉంటే ఇంకా నష్టపోతావని సామంత్ కి కనకం వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇలా మోసం చేసి చేయడం కరెక్ట్ కాదని రాజ్ అనగానే.. ఇది మీరు చేసిందే.. చెప్పిందే అంటూ గతంలో రాజ్ చెప్పింది గుర్తుచెయ్యగానే రాజ్ తప్పించుకుని వెళ్తాడు. రాజ్ వెళ్తుంటే ఆగరా నన్ను వదిలేసి వెళ్తున్నావంటూ రుద్రాణి అంటాడు. ఆటో కి డబ్బులు కూడా లేవ్ అనుకుంటా నడుచుకుంటూ వెళ్ళండి అని రుద్రాణికి కావ్య కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత కావ్యకి ఇందిరాదేవి ఫోన్ చేసి.. మీ అత్త సుభాష్ ని ఇంక క్షమించలేదని చెప్తుంది. దాంతో అపర్ణని కావ్య కలుస్తుంది. మావయ్య గారికి రెండో ఛాన్స్ ఇవ్వండి. మీరు ఇలా ఉంటే మీ అబ్బాయి కూడా ఇలా ఉంటాడని అపర్ణతో కావ్య మాట్లాడుతుంది.
ఆ తర్వాత అపర్ణ ఇంటికి వెళ్లి సుభాష్ తో మాట్లాడుతుంది. నన్ను క్షమించండి మీపై చాలా కఠినంగా ఉన్నానని అపర్ణ అనగానే.. సుభాష్ తో పాటు అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా కావ్య మాట్లాడ్డం వాళ్లే అని ఇందిరాదేవి అనగానే.. ఈ మాయ ఆవిడా గారిదేనా అని రాజ్ వెటకారంగా మాట్లాడతాడు. ఆ తర్వాత రాహుల్, రుద్రాణి లు మాట్లాడుకుంటుంటే.. అదంతా చేసింది నేనే అని స్వప్న వాళ్ళతో చెప్తుంది. తరువాయి భాగంలో ఇందిరాదేవి కావ్యకి ఫోన్ చేసి అపర్ణ మారిపోయింది. ఇక మారాల్సింది రాజ్ మాత్రమేనని అంటుంది. ఆ తర్వాత ఏం మాయ చేసి మార్చావ్ ఇదంతా మీకు అలవాటే అని కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.