కింగ్డమ్ మూవీ రివ్యూ
'పెళ్ళి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి ఘన విజయాలతో కెరీర్ స్టార్టింగ్ లో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ.. తర్వాత ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయాడు. విజయ్ నటించిన గత ఐదు చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో 'కింగ్డమ్'పైనే ఆశలు పెట్టుకున్నాడు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు కావడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో 'కింగ్డమ్'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్ ఎదురుచూస్తున్న విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.