English | Telugu

తన పుట్టినరోజు సందర్భంగా మరో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన సోనూ సూద్‌!

భారతీయ చిత్ర పరిశ్రమలో అపర కర్ణుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సోనూ సూద్‌. గత కొన్నేళ్లుగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న సోనూ ఇప్పుడు మరో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. జూలై 30 తన పుట్టిన రోజు సందర్భంగా వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. 52వ ఏట అడుగుపెట్టిన సోనూ.. 500 మంది వృద్ధులకు ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఆశ్రమంలో వృద్ధులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు వైద్య సహాయం, పోషకారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వయసులో వారికి ఎమోషనల్‌గా సపోర్ట్‌ అందించే విధంగా ఈ ఆశ్రమాన్ని తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు.

సినిమాల్లో క్రూరమైన విలన్‌గా కనిపించే సోనూ.. నిజ జీవితంలో ఎంతటి మానతావాది అనేది గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు ఆయన చేసిన సేవలకుగాను ఇటీవల జరిగిన మిస్‌ వరల్డ్‌ 2025లో ప్రతిష్ఠాత్మక మానవతావాది పురస్కారాన్ని అందుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో సోనూ చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేదు. వలస కూలీలను తన సొంత ఖర్చుతో బస్సులు ఏర్పాటు చేసి దగ్గరుండి వారిని సొంత ఊళ్ళకు పంపించడం, తన హోటల్‌ మొత్తాన్ని కరోనా బాధితులకు కేటాయించడం.. వంటి మంచి పనులు ఆయన్ని రియల్‌ హీరోని చేశాయి. ఆయన సేవా కార్యక్రమాలు అక్కడితో ఆగలేదు. సోషల్‌ మీడియాలో తన వరకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ.. సాయం కోరిన వారిని ఆదుకుంటూ తన సేవా నిరతిని చాటుకుంటున్నారు సోనూ సూద్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.