రజినీకాంత్ + కమల్‌హాసన్ = చిరంజీవి అని కన్ఫర్మ్ చేసిన టాప్ డైరెక్టర్!
మెగాస్టార్ చిరంజీవి జీవితం గురించి, ఆయన సినిమాల్లో ఎదిగిన తీరు గురించి అందరికీ తెలుసు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. ఇక తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజిఆర్, శివాజీ గణేశన్ తర్వాత ఆ స్థానాలను భర్తీ చేసిన హీరోలు రజినీకాంత్, కమల్‌హాసన్. వీరిద్దరికీ గురువు ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్.