గొర్రెల స్కాం దర్యాప్తులో దూకుడు పెంచిన ఈడీ.. తలసాని పాత్రపై దర్యాప్తు
గొర్రెల స్కాం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలపై గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది.