బ్లూ ఫిల్మ్స్ తెగ చూసేస్తున్న భారతావని.. ప్రపంచంలో మూడో స్థానం
భారత ప్రభుత్వం పాతిక అశ్లీల యాప్లు, వెబ్సైట్లపై నిషేధం విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకొంది. 2018లో కూడా భారత టెలీ కమ్యూనికేషన్ విభాగం 827 పోర్న్ వెబ్సైట్లు బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చింది. అంతకు ముందు 2015లో సైతం సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి 850 పోర్న్ వెబ్సైట్లను బ్లాక్ చేసింది.