English | Telugu
శ్రీహరికోట నుంచి నింగిలోకి నిసార్ శాటిలైట్ GSLV-F16 రాకెట్ దూసుకెళ్లింది.సెకెండ్ లాచ్ ప్యాడ్ నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.
పహల్గాం ఉగ్రదాడి.. ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో జూలై 28,29 తేదీలలో రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే.. ఈ సుదీర్ఘ చర్చ వలన దేశానికి ఏమి జరిగింది? దేశం ముందున్న సందేహాలకు ఏ మేరకు సమాధానం లభించిది? అంటే మాత్రం సమాధానం చెప్పడం సాధ్యం కాదు.
ఏపీలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలపై నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి లోక్ సభ దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటన ముగిసింది. ఆ ఏపీకి బయలుదేరారు. నాలుగు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా ఆయన మొత్తం 26 సమావేశాలలో పాల్గొన్నారు.
సింగపూర్ పర్యటనలో నాలుగో రోజు మంత్రి నారా లోకేశ్ బృందం సెసిల్ స్ట్రీట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ను సందర్శించారు
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రీ బస్సు పథకానికి శ్రీకారం చుడుతున్నారని ఆయన అన్నారు.
భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
థియేటర్లో సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీసిన సంఘటన బుధవారం కావలిలో జరిగింది. నెల్లూరు జిల్లా కావలిలోని స్రవంతి థియోటర్ లో సినిమా నడుస్తుండగానే ప్రొజెక్టర్ రూంలో ఒక్క సారిగా మంటలుచెలరేగి థియోటర్ మొత్తం వ్యాపించాయి.
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్ ఈ నెల 31 నుంచి తలపెట్టిన పాదయాత్ర వాయిదాపడింది. ఆగస్టు 5, 6, 7 తేదీలలో కాంగ్రెస్ లో బిజీ షెడ్యూల్ కారణంగా ఈ యాత్ర వాయిదా పడింది.
కడప జిల్లాలో రూ. 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు వచ్చే నెల 1న శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి పథకం చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగస్టు1వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉథృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆ సుందర జలదృశ్యాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు.
కింద పడ్డా పై చేయి నాదే అన్న నానుడి వినే ఉంటారు ...అచ్చం అలాగే వ్యవహరిస్తున్నరట మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్. మద్యం కుంభకోణం కేసులో పీకల్లోతు కూరుకుపోయిన జగన్ రేపో మాపో విచారణ ఎదుర్కోక తప్పదని ఓ పక్కన లోకం మొత్తం కోడై కూస్తున్నా.. అబ్బే మనకున్న పరపతి ముందు కేసులు పెద్ద లెక్క కాదు అనేలా బిల్డప్ ఇస్తున్నారా అనిపిస్తుంది ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.
సృష్టి కేసులో తవ్వే కొద్దీ నమ్మలేని నిజాలు బయట పడుతున్నాయి. డాక్టర్ నమ్రత జగత్ జంత్రీగా కనిపిస్తోంది. ఆమె ఇప్పటి వరకూ హైదరాబాద్ లో 30 సరోగసీ కేసులు హ్యాండిల్ చేయగా.. ఆమె బేబీ సెంటర్ కి సరోగసీ విషయంలో కనీసం పర్మిషన్లు లేవని తెలుస్తోంది.
జగన్ ప్రెస్ మీట్లకు.. ఈ మధ్య రాముడు మంచి బాలుడికి మల్లే వచ్చేస్తున్నారు. భల్లే భల్లే కబుర్లు చెబుతున్నారు. అంతా బాగుంది. ఆయన కబుర్లన్నీ పేపర్లూ, టీవీల్లో వచ్చేస్తాయి. కాదనడం లేదు. కానీ ఈ బొట్టు పెట్టుకుని మరీ బుద్ధిమంతుడ్లా కనిపించడమేంటా? అన్నది ఒక అనుమానం. ప్రశ్న. చర్చ. వగైరా వగైరా.
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం (జులై 30) 8.8 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.