English | Telugu
సెల్పీ తీసుకుంటూ రైలు నుంచి జారిపడిన యువకుడు
Updated : Jul 29, 2025
యువతీ, యువకులు సెల్ఫీ మోజులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు, నదులు, కొండలు వంటి ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు కదులుతున్న రైలులో తలుపు వద్ద నుంచుని సెల్పీ తీసుకునే ప్రయత్నంలో రైలు నుంచి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి వద్ద చోటు చేసుకుంది. మదనపల్లె కురబల కోట రైల్వే స్టేషన్ వద్ద సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో రైల్లోంచి జారిపడిన తీవ్రంగా గాయపడి మహ్మద్ నస్రీన్ అనే 18 ఏళ్ల యువకుడు ప్రస్తుతం మదనపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.