English | Telugu
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక భారీ రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది.
మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నాసాతో కలిసి చేయనున్న ఈ కీలక ప్రయోగానికి మంగళవారం మధ్యాహ్నం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు మంగళవారం మూడో రోజు షెడ్యూల్ దాదాపు పది సమావేశాలతో బిజీబిజీగా ఉంది.
ప్రజాప్రతినిథి ప్రజా సేవలో 24 X7 పని చేయాలని జనం భావిస్తారు. ఆ నమ్మకంతోనే ఓట్లేసి గెలిపిస్తారు. అయితే చాలా మంది ఎన్నికలకు ముందు ప్రజా సేవ పట్ల చూపిన ఆసక్తిని ఆ తరువాత చూపించరు.
కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల ధృవీకరణ పత్రాల జారీ కోసం ఇంటింటి సర్వే చేపసట్టాలని నిర్ణయించింది.
ఎస్ బీఐ లో భారీ చోరీ జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా తూముకుంట పారిశ్రామికవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు చోరీకి పాల్పడ్డారు.
కేరళ నర్సు నిమిషప్రియ మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు యెమెన్ ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
బీసీలకు 42% రిజర్వేషన్లుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైన నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు చేపట్టాలని కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
తెలంగాణ స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి రామనాథం ప్రకటించారు.
తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.
దేశ రాజకీయాలకు తెలుగు తరం, పనితనాన్ని పరిచయం చేస్తున్నారు ఓ యువ ఎంపీ ....ఎంపీ గా మాత్రమే కాదు కేంద్ర సహాయ మంత్రిగా తన పనితనాన్ని , యావత్ భారతదేశానికి పరిచయం చేస్తున్నారు
తనకంటే ఎంతో సీనియర్ అయిన కోనేరు హంపిని ఓడించి ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ విజేతగా దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది. తాజాగా (28-7-25) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోనేరు హంపిపై దివ్య దేశ్‌ముఖ్ విజయం సాధించింది.
హైదరాబాద్ నగరంలో చిరుత సంచారం కలకలం రేపింది. గోల్కొండ ప్రాంతంలో ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతున్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.