అడ్డంగా బుక్కైన జె గ్యాంగ్ సభ్యుడు.. నోట్ల కట్టల వీడియోలు బయటపెట్టిన సిట్
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో వైసీపీ గ్యాంగ్ ఒక్కరొక్కరుగా బుక్కౌతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఫోన్ నుంచే డబ్బుల డెన్ వీడియోలను సిట్ రిట్రీవ్ చేసింది. మద్యం ముడుపుల సొమ్ములు దాచిన డెన్ లో నోట్ల కట్టలను లెక్కిస్తూ చెవిరెడ్డి అత్యంత సన్నిహితుడు, ఆయన పీఏ అడ్డంగా దొరికిపోయాడు.