English | Telugu

Karthika Deepam2 : పెళ్ళికి వస్తానన్న శ్రీధర్.. తప్పులన్ని ఒప్పుకున్న పారిజాతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -440 లో..... శ్రీధర్ దగ్గరికి కార్తీక్ వెళ్తాడు. కాసేపు నువ్వు ఎవరో నేను ఎవరో అనుకుని మాట్లాడుకుందామని కార్తీక్ అంటాడు. సరే అనీ శ్రీధర్ అంటాడు. నా పేరు కార్తీక్.. మాది హ్యాపీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషం గా ఉండే మా అమ్మ.. మా అమ్మని చిన్న పిల్లలా చూసుకునే నాన్న అని కార్తీక్ తన స్టోరీ చెప్తాడు. మా నాన్న సిగరెట్ కాలుస్తాడు. ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. మా నాన్నతో నేనొక ఫ్రెండ్ లాగా ఉండేవాడిని అని కార్తీక్ చెప్తుంటే శ్రీధర్ సైలెంట్ గా వింటాడు.