English | Telugu

బిగ్ బాస్ అంటే ఇష్టం అందుకే ఇది వేసుకున్న

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో హోల్డ్ లో ఉన్న కామనర్స్ కి డేర్ ఆర్ డై లెవెల్ 1 లో టాస్కులు ఇస్తోంది శ్రీముఖి. ఇప్పుడు ఊర్మిళ వెర్సెస్ శ్రీజ మధ్య ఒక టాస్క్ పెట్టింది. "బిగ్ బాస్ సీజన్ 3 లో ఒకానొక టాస్క్ లో నేను ఈ బిగ్ బాస్ టాటూ వేయించుకున్నాను..కాబట్టి మీరు నుదిటి మీద ఐ యామ్ ఏ లూజర్" అని టాటూ వేయించుకోవాలి అని చెప్పింది శ్రీముఖి. దాంతో ఊర్మిళ వెంటనే "నేను వెళ్లి కూర్చుంటున్నాను. ఎందుకంటే నేను లూజర్ ని కాదు కాబట్టి" అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక శ్రీజ మాత్రం తాను వెనకడుగు వేయను అని టాటూ వేయించుకుంటాను  అని చెప్పింది. "అంటే నుదుటి మీద జీవితాంతం కనిపించేలా ఐ యాం ఏ లూజర్ అని వేయించుకుంటావా" అని శ్రీముఖి అడిగింది. హా వేయించుకుంటాను..ఎక్కడైనా పర్లేదు నాకు  అని శ్రీజ అనేసరికి ఇచ్చి పడేసింది అంటూ నవదీప్ అన్నాడు. ఇక శ్రీముఖి నీ పేరులోనే దమ్ము ఉంది అనుకున్నా కానీ నీలో కూడా చాల దమ్ముంది అంటూ  అసలు విషయం చెప్పింది.

బిగ్ బాస్ లో నేనే విన్నర్...

బిగ్ బాస్ అగ్ని పరీక్షలో డబ్బా రేకుల రాణి అలియాస్ శ్రీజ ఐతే బీభత్సం సృష్టించింది. విశాఖపట్నం నుంచి శ్రీజ వచ్చింది. అసలు మాములు వాగుడు కాదు. బాబోయ్  రావడమే స్టేజి మీద అరుస్తూ అందరినీ షాకయ్యేలా చేసింది. దమ్ము చూపిస్తా దుమ్ము రేపుతా అని అదేపనిగా వసపిట్టలా వాగుతూనే ఉంది. జడ్జెస్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. "మీకంటే బాగా ఎంటర్టైన్ చేయగలను...మీకు కంటెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి అవన్నీ నేను చేయగలను...బిగ్ బాస్ కి నన్ను ఎందుకు పంపాలో నేనే చెప్పేస్తున్నా..అభిజిత్ గారు అంతా మైండ్ లో స్ట్రాటజీస్ అవీ వేసి ఆడవాళ్లు...ఫిజికల్ గేమ్స్ ఎప్పుడూ ఆడలేదు. కానీ నేను ఫిజికల్ గా కూడా ఆడతాను .. స్మార్ట్ గా కూడా ఆడగలను..ఇక ఆడపులి గారి పేరును కూడా నేను త్వరలో సొంతం చేసేసుకుంటాను...బిగ్ బాస్ ఈ సీజన్ లో నేను విన్నర్ ఐపోతాను" అంటూ గ్యాప్ లేకుండా చెప్పేసింది.

ప్లే బ్యాక్ సింగర్ శ్రీతేజకు శ్రీముఖి సలహా

బిగ్ బాస్ అగ్నిపరీక్షకు సింగర్ శ్రీతేజ రాజమండ్రి నుంచి వచ్చాడు. ఇక శ్రీముఖి ఐతే రాజమండ్రి యాసలో మాట్లాడొచ్చు కదా అనేసరికి ఆ యాస ఉంటే అదే వచ్చేస్తుంది అని చెప్పాడు. ఎం చేస్తుంటారు, ఏదన్న మూవీస్ లో పాడావా అని అభిజిత్, బిందు మాధవి అడిగారు. తానొక ప్లే బ్యాక్ సింగర్ అని చాలా మూవీస్ లో పాడానని ఐతే తన పేరు ఎండ్ టైటిల్ కార్డ్స్ లో ఉంది కానీ మెయిన్ టైటిల్ కార్డ్స్ లో లేదు అని చెప్పాడు. ఇక అతని సింగింగ్ టాలెంట్ చూద్దాం అని శ్రీముఖి అనేసరికి నాగార్జున నటించిన గీతాంజలి మూవీలోని ఒక సాంగ్ పాడాడు. ఇక బిగ్ బాస్ ఎందుకు అన్న శ్రీముఖి ప్రశ్నకు "నేనేమి అనుకుంటున్నాను అంటే ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు వచ్చినా గట్టిగా మాట్లాడేవాళ్ళు వచ్చినా ముందు నేను వాళ్ళను కామ్ చేయగలను   మంచిగా మాట్లాడగలను.