గోవాలో కూతురికి ట్రీట్ ఇచ్చిన సురేఖావాణి!
కూతురు సుప్రీతతో నటి సురేఖావాణి ఓ కన్నతల్లిగా కంటే స్నేహితురాలిగా, పెద్దక్కలా సన్నిహితంగా ఉంటారు. అమ్మాయితో కలిసి డ్యాన్సులు చేస్తారు, జోకులు వేస్తారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో వీళ్లిద్దరూ చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు కూతుర్ని తీసుకుని సురేఖావాణి గోవా వెళ్లారు. ఎందుకో తెలుసా? ఆదివారం సుప్రీత పుట్టినరోజు. గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం కోసం అక్కడికి వెళ్లారన్నమాట.