English | Telugu

బిగ్ బాస్ 5.. ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌కు క్రేజీ ఆఫ‌ర్‌!

యూట్యూబ‌ర్‌గా ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియాలోనూ అత‌డి ఫాలోయ‌ర్స్ సంఖ్య త‌క్కువేమీ కాదు. త‌న వీడియోల‌తోనే కాకుండా, ఇత‌ర‌త్రా కూడా ష‌ణ్ముఖ్ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నాడు. యూట్యూబ్‌లో అత‌డు క్రియేట్ చేసే రికార్డుల‌ను, యూత్‌లో అత‌డికున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాల‌ని బిగ్ బాస్ తెలుగు నిర్వాహ‌కులు చాలా కాలంగా ట్రై చేస్తూనే ఉన్నారు. మునుప‌టి సీజ‌న్ల‌కు త‌న‌కు ఆఫ‌ర్ చేసిన రెమ్యూన‌రేష‌న్ అసంతృప్తి క‌లిగించ‌డంతో అత‌ను ఆ షోలో భాగం కావ‌డానికి అంగీక‌రించ‌లేదు.

దాంతో బిగ్ బాస్ 5 సీజ‌న్‌కు అత‌డిని ఎలాగైనా తీసుకురావాల‌ని షో నిర్వాహ‌కులు నిర్ణ‌యం తీసుకున్నారు. దీని కోసం భారీ మొత్తాన్నే అత‌డికి ఆఫ‌ర్ చేశార‌నీ, త‌ను ఊహించిన దానికి మించి ఆఫ‌ర్ రావ‌డంతో ష‌ణ్ముఖ్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లూ ప్ర‌చారం జ‌రుగుతోంది. బిగ్ బాస్ 5లో పాల్గొనే కంటెస్టెంట్లు అంద‌రికంటే అత‌డికే ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ ముడుతున్న‌ట్లు, అది కోటి రూపాయ‌ల దాకా ఉంటుంద‌న్న‌ట్లు చెప్పుకుంటున్నారు.

నాలుగో సీజ‌న్‌లో ఎక్కువ పాపుల‌ర్ ఫేస్‌లు లేవ‌నే విమ‌ర్శ‌లు రావ‌డంతో, ఈసారి వార్త‌ల్లో వ్య‌క్తుల మీద‌నే ఆర్గ‌నైజ‌ర్స్ ఫోక‌స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి సురేఖా వాణి, యాంక‌ర్ వ‌ర్షిణి సౌంద‌రాజ‌న్‌, యాంక‌ర్ ర‌వి, టీవీ బ్యూటీ న‌వ్య స్వామి, సినీ తార‌లు ఇషా చావ్లా, పూన‌మ్ బ‌జ్వా, కొరియోగ్రాఫ‌ర్ ఆనీ లాంటి వారు వెళ్ల‌నున్న‌ట్లు ఓ లిస్టు ఆన్‌లైన్‌లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అదే నిజ‌మైతే బిగినింగ్ నుంచే 5వ సీజ‌న్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అంత‌మంది సెల‌బ్రిటీల్లో ష‌ణ్ముఖ్‌కే ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ ద‌క్కుతుండ‌టం టాక్ ఆఫ్ ద టౌన్‌. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే బిగ్ బాస్ 5 తెలుగు సెప్టెంబ‌ర్ 5న మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.