English | Telugu

అక్ష‌య్‌కుమార్ పాత్ర‌లో మంచు హీరో?

మంచు హీరోల సినిమా అంటే దాదాపుగా సొంత ప్రొడ‌క్ష‌న్‌లోనే ఉంటుంది. బ‌య‌టి నిర్మాత‌లు ఈ హీరోల‌తో సినిమాలు చేసింది త‌క్కువ‌. అయితే ఇప్పుడు మంచు హీరోకి అలాంటి ఆఫ‌ర్ వ‌చ్చింది. బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం స్పెష‌ల్ ఛ‌బ్బీస్‌. అక్ష‌య్‌కుమార్, కాజ‌ల్ జంట‌గా న‌టించిన ఈ చిత్రం అక్క‌డ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. అంతేకాదు, మంచి వ‌సూళ్లూ ద‌క్కించుకొంది. ఈ సినిమాని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో రీమేక్ చేద్దామ‌నుకొంటున్నారు. రీమేక్ హ‌క్కులు ప్ర‌శాంత్ నాన్న త్యాగ‌రాజ‌న్ ద‌గ్గ‌రున్నాయి. తెలుగులో ఈ సినిమాకి మంచు విష్ణుని క‌థానాయ‌కుడిగా ఎంచుకొన్నార‌ని తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు, మిగిలిన టీమ్ వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టించిన ఎర్ర‌బ‌స్సు ఈనెల 14న విడుద‌ల కానుంది. ఆ త‌ర‌వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై దేవ‌క‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఓ చిత్రంలో న‌టించ‌నున్నాడు విష్ణు. దానితో పాటు స్పెష‌ల్ ఛ‌బ్బీస్ సినిమా రీమేక్ కూడా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.