English | Telugu

బాల‌య్య‌, ఎన్టీఆర్ క‌లుస్తున్నారోచ్‌!

నంద‌మూరి అభిమానుల‌కు ఇంత‌కంటే శుభ‌వార్త ఏముంటుంది.?? అటు బాల‌య్య‌, ఇటు ఎన్టీఆర్ వాళ్ల‌కు రెండు క‌ళ్లు. వీరిద్ద‌రూ గ‌త కొంతకాలంగా ఎడ‌మెహం, పెడ‌మొహంగా ఉంటున్నారు. ఎట్ట‌కేల‌కు వీరిద్ద‌రు క‌ల‌వ‌బోతున్నారు. అదెలాగంటారా..?? హుద్ హుద్ బాధితుల‌కు బాస‌ట‌గా నిల‌వ‌డానికి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ `మేము సైతం` అనే ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌బోతోంది. తెలుగు సినీరంగ‌మంతా ఏక‌మై, వినోద కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించ‌బోతోంది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా స‌మ‌కూరే ఆదాయాన్ని హుద్ హుద్ బాధితుల‌కు విరాళంగా ఇవ్వ‌బోతోంది. అగ్ర హీరోలు, కొత్త - పాత‌త‌రం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంతా ఈ వినోద కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోబోతున్నారు. న‌లుగురైదుగురు న‌టులు క‌ల‌సి ఓ స్కిట్ వేయ‌బోతున్నార‌ట‌. ఇలా క‌నీసం ప‌ది స్కిట్లు వేసి, ప్రేక్ష‌కులకు వినోదం పంచ‌బోతున్నార‌ని తెలిసింది. ఓ స్కిట్‌లో నంద‌మూరి హీరోలు క‌లసి న‌టించే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ టాక్‌. ఈ స్కిట్లో బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌లు కూడా న‌టిస్తార‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే... అభిమానుల‌కు కనుల పండ‌గే!! వీరిద్ద‌రినీ ఎలాగైనా ఒప్పించి ఓ స్కిట్ వేయించాల‌ని ''మా'' విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.