English | Telugu

వార్-2 వల్ల యశ్ రాజ్ ఫిలిమ్స్ కి ఎంత నష్టమో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం 'వార్-2'. ఎన్టీఆర్, హృతిక్ వంటి బిగ్ స్టార్స్ కలిసి నటించడం.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగం రూపొందిన సినిమా కావడంతో.. 'వార్-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆగస్టు 14న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్.. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇప్పటిదాకా రూ.310 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో 400 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా చేస్తున్నాయి. అయితే 'వార్-2' సినిమా స్థాయికి, ఆ బడ్జెట్ కి.. ఆ వసూళ్లు సరిపోవు. అందుకే యశ్ రాజ్ ఫిలిమ్స్ కి భారీ నష్టం వచ్చిందని, కనీసం వంద కోట్లు నష్టపోయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది.

రెమ్యూనరేషన్స్ తో కలిపి 'వార్-2' మొత్తం బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు అయిందట. అయితే ఇందులో సగానికి పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే వచ్చినట్లు సమాచారం. డిజిటల్ రైట్స్ రూ.150 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.50 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.25 కోట్లతో.. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మొత్తం రూ.225 కోట్లు వచ్చాయట. ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలుగు స్టేట్స్ లో తప్ప మిగతా అన్ని చోట్లా సొంతంగా విడుదల చేసుకుంది యశ్ రాజ్ ఫిలిమ్స్. తెలుగు రైట్స్ ద్వారా రూ.80 కోట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా రూ.120 కోట్ల షేర్ రాబట్టింది. అంటే థియేట్రికల్ ద్వారా రూ.200 కోట్లు వచ్చాయి. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలిపి వైఆర్ఎఫ్ కి మొత్తం రూ.425 కోట్లు వచ్చాయని అంచనా.

రూ.400 కోట్ల బడ్జెట్ ని బట్టి చూస్తే.. రూ.425 కోట్లు రికవర్ అయ్యాయి కాబట్టి.. యశ్ రాజ్ ఫిలిమ్స్ సేఫ్ జోన్ లో ఉన్నట్లే. అయితే తెలుగు రైట్స్ రూ.80 కోట్లకు తీసుకున్న నిర్మాత నాగవంశీ.. నష్టాలను చూడబోతున్నారు. దీంతో ఆయనకు రూ.22 కోట్లు రిటర్న్ ఇవ్వడానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ ముందుకొచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఆ పరిహారంతో పాటు, సినిమా పబ్లిసిటీ ఖర్చులను కలుపుకుంటే.. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్వల్ప నష్టాలతోనే బయట పడినట్లు అంచనా. పైగా ఇటీవల వైఆర్ఎఫ్ నుంచి వచ్చిన 'సైయారా' అనే సినిమా ఏకంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టడంతో.. 'వార్-2' వల్ల వచ్చే స్వల్ప నష్టాలు ఆ సంస్థకు పెద్ద లెక్క కాదనే మాట వినిపిస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .