English | Telugu

పాన్ ఇండియా సినిమాలను తలదన్నేలా ఓజీ బిజినెస్..!

సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా తెలుగునాట తరగని క్రేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం. గత చిత్రం 'హరి హర వీరమల్లు'తో నిరాశపరిచిన పవన్ కళ్యాణ్.. సెప్టెంబర్ 25న 'ఓజీ'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. 'ఓజీ' నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే 'ఓజీ' థియేట్రికల్ బిజినెస్ కి ఓ రేంజ్ లో డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.

'ఓజీ' మూవీ దాదాపు రూ.200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసే అవకాశముందని అంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.160 కోట్ల బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని అంచనా. నైజాంకి రూ.60 కోట్లు, ఆంధ్రాకి రూ.70 కోట్లు, సీడెడ్ కి రూ.25 కోట్లు చొప్పున నిర్మాతలు కోట్ చేస్తున్నారట. ప్రస్తుతం సినిమాపై నెలకొన్న హైప్ వల్ల.. డిస్ట్రిబ్యూటర్స్ ఆ ధరలకు రైట్స్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడట్లేదని సమాచారం. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి రూ.40 కోట్ల దాకా బిజినెస్ జరిగే అవకాశముంది. అంటే 'ఓజీ' మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.200 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ కావడం విశేషం.

'ఓజీ'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే రూ.500 కోట్ల గ్రాస్ రాబడుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అదే జరిగితే పవన్ కళ్యాణ్ అసలుసిసలైన బాక్సాఫీస్ స్టామినాను తెలిపే సినిమాగా ఓజీ నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.