English | Telugu
ఇండియన్ సినిమాకి మరో సవాలు విసరబోతున్న కేజీఎఫ్ యష్
Updated : Dec 4, 2023
కేజీఎఫ్ సిరీస్ తో భారత దేశ వ్యాప్తంగా స్టార్ డమ్ ని సంపాదించుకున్న నటుడు యష్ .ఆ సిరీస్ తోనే యష్ పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు. అంతే కాకుండా కన్నడ సినీ పరిశ్రమ కూడా ఇండియా వైడ్ గా రికార్డు కలెక్షన్స్ ని సృష్టించే సినిమా తియ్యగలదు అని కూడా నిరూపించింది. కానీ కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ ఇప్పటి వరకూ ఎలాంటి కొత్త సినిమాని ప్రకటించలేదు.కానీ తాజాగా యష్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
రాక్ స్టార్ యశ్ తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా తన డీపీ ని చేంజ్ చేయడం జరిగింది. చేంజ్ చెయ్యడమే కాదు లోడింగ్ అంటూ ఇంగ్లీష్ లో రాసి ఉన్న ఒక పిక్ ని డీపీ గా పెట్టడంతో ఇప్పుడు యష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఖచ్చితంగా అది తమ అభిమాన హీరోకి సంబందించిన కొత్త మూవీ అప్డేట్ అయ్యి ఉంటుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. కాగా యష్ కొత్త మూవీ అప్ డేట్ కోసం భారతదేశ వ్యాప్తంగా ఉన్న యష్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ నెల చివరిలో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే రానుంది.
2007 లో వచ్చిన జంబడ హుడిగి అనే చిత్రం ద్వారా కన్నడ సినీ రంగ ప్రవేశం చేసిన యష్ ఇప్పటి వరకు 20 చిత్రాలకి పైగానే చేసాడు. 2018 ,22 లో వచ్చినకేజీఎఫ్ చాప్టర్ 1 ,2 లతో రికార్డు కలెక్షన్స్ ని సృష్టించడమే కాకుండా ఎన్నో సినిమాలకి సవాలు విసిరిన యష్ తన కొత్త చిత్రాన్ని త్వరగా ప్రారంభించాలని అలాగే ఆ సినిమా ఇండియన్ సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులని సృష్టించాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.