English | Telugu

యామి గౌతమ్ 'ఫెయిర్ నెస్'


టీవీలో యాడ్స్ చూస్తున్నప్పుడు, ముఖ్యంగా సబ్బులు, క్రీంలా ప్రకటనలు చూస్తున్నప్పుడు చాలా మందికి కలిగే అనుమానం, ఆయా ప్రచారకర్తలు ఆ సాధానాలను ఒక్కసారైనా వాడతారా అని...

ఈ విషయంలో చాలా ఫెయిర్ గా సమాధానం ఇచ్చింది యామి గౌతమ్. మీ చర్మం తళతళలాడుతుంది, తెల్లగా వుంటే మీ దశ, దిశ తిరిగిపోతుంది, అంతులేని ఆత్మవిశ్వాసంతో చెలరేగిపోవచ్చు అని వచ్చే రకరకాల సౌందర్య సాధనాల ప్రకటనల్లో కనిపించే యామి అందరికీ సుపరిచితమే. ప్రకటనలతో పాటు బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ లలో వివిధ సినిమాల్లో ఆమె నటించింది.

ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో మీరు వాడే కాస్మటిక్స్ ఏవో చెప్పండి, మీ బ్యూటీ సీక్రెట్ చెప్పండి అని అడిగిన వారికి ఫ్యూజు ఎగిరిపోయే సమాధానం ఇచ్చింది యామి. ఫెయిర్‌నెస్ క్రీముల ప్రకటనల్లో విరివిగా కనిపించే ఈ భామ అసలు ఏ క్రీం రాసుకోదట. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి కూడా సబ్బు వాడుతుందట.

ఇంతలో ఎండార్స్ చేసిన కంపెనీలో గుర్తుకు వచ్చాయేమో, వెంటనే మాట మార్చేసింది. మీరు మాత్రం పెయి‌ర్‌నెస్ క్రీములు వాడండి, అవి ఈ రోజుల్లో వాడటం అవసరం అని చెప్పుకొచ్చిందట. ఇంటర్వ్యూ చేస్తున్న వారు, చూస్తున్నవారు యామి సమాధానాలకు నోరెల్లబెట్టారట. ఫెయిర్‌నెస్ క్రీం విషయం ఎలా వున్నా యామీ ఫెయిర్‌గా మాట్లాడినందుకు అభినందించాల్సిందే అని సర్దుకున్నారట ఆ తర్వాత.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.