English | Telugu

అనుమానాస్పద స్థితిలో నిర్మాత కుటుంబం మృతి


మలయాళ సినీ నిర్మాత సంతోష్ కుమార్ కుటుంబ సమేతంగా అనుమానాస్పద స్థితిలో మరణించారు. సంతోష్ కుమార్ ఆయన భార్య, కుమార్తెతో కలిసి ఐదేళ్లుగా దుబాయ్ లో నివాసముంటున్నారు. పోయిన గురువారం నుంచి సంతోష్ కుటుంబానికి సంబంధించిన ఎవరూ ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో సమీప బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంతోష్ నివాసముంటున్న ఫ్లాట్ తలుపులు పగులగొట్టి చూడగా ముగ్గురి మృతదేహాలు కనిపించాయి.కుళ్లిపోయి కనిపించిన వీరి మృతదేహాలపై అనేక కత్తిపోట్లు కనిపిస్తుండగా, దీనిని అక్కడి పోలీసులు మాత్రం ఆత్మహత్యలుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుల బాధ తాళలేక సంతోష్ కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు.


సంతోష్ కుమార్ కేరళలో సౌపర్ణిక ఫిలింస్ నిర్మాణ సంస్థ తో పాటు దుబాయ్ లో ఇతర వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 'మడాంబి' సినిమాకు ఆయన కోప్రొడ్యూసర్. అలాగే మరిన్ని రీమేక్ చిత్రాలు కూడా ఆయన నిర్మించారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.