English | Telugu
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్.. ఈ వారమే షూట్!
Updated : Apr 26, 2023
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ తర్వాత కూడా వీరి కాంబోలో ఒక మూవీ ప్రకటన వచ్చింది. నిజానికి ఎన్టీఆర్ తన 30వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయాల్సి ఉంది. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పక్కకెళ్ళిపోయి.. ఆ స్థానంలో కొరటాల శివ ప్రాజెక్ట్ వచ్చింది. అయితే భవిష్యత్తులో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని నిర్మాత నాగవంశీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మరి ఆ ప్రాజెక్ట్ కి ఎప్పుడు మోక్షం కలుగుతుందో తెలీదు కానీ.. ఇప్పుడైతే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. అయితే అది సినిమా కాదు, ఒక యాడ్ కావడం విశేషం.
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తో తమ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకోవడానికి పలు బడా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు బ్రాండ్ లకు ప్రకటన కర్తగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్.. తాజాగా మరో బ్రాండ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్రాండ్ యాడ్ కి త్రివిక్రమ్ దర్శకుడు కావడం విశేషం. ఈ వారంలోనే హైదరాబాద్ లో ఈ యాడ్ షూట్ జరగనుంది. గతంలోనూ ఎన్టీఆర్ నటించిన కొన్ని యాడ్స్ ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళ కాంబోలో మరో యాడ్ రాబోతోంది. మరి వీళ్ళ కాంబోలో రెండో సినిమాకి ఎప్పుడు ముహూర్తం కుదురుతుందో చూడాలి.