English | Telugu
'విరూపాక్ష' ముందు భారీ టార్గెట్!
Updated : Apr 19, 2023
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ 'విరూపాక్ష'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విజయాన్ని సాధించాలంటే భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాల్సి ఉంది.
సాయి ధరమ్ తేజ్ చివరి చిత్రం 'రిపబ్లిక్' బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైనప్పటికీ.. 'విరూపాక్ష' బిజినెస్ భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. నైజాంలో రూ.7 కోట్లు, సీడెడ్ లో రూ.4 కోట్లు, ఆంధ్రాలో రూ.9 కోట్లకు అమ్ముడైన విరూపాక్ష.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.20 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ.1.50 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.23 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. అంటే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలవాలంటే కనీసం రూ.24 కోట్ల షేర్ రాబట్టాల్సింది ఉంది.
'విరూపాక్ష' సాయి తేజ్ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది. మీడియం రేంజ్ హీరో నటించిన థ్రిల్లర్ సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరగడం విశేషమే. రూ.33 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఇప్పటిదాకా సాయి తేజ్ కెరీర్ లో కలెక్షన్స్ పరంగా 'ప్రతిరోజూ పండగే' టాప్ లో ఉంది. మరి 'విరూపాక్ష' కూడా ఆ స్థాయి వసూళ్లు రాబట్టి సత్తా చాటుతుందేమో చూడాలి.