English | Telugu

విజయ్ సేతుపతి  మళ్లి  అతనితోనే ఎందుకు..

ఎవరి టైం ఎప్పుడు ఎలా ఉంటుందో,ఎలా మారుతుందో, ఏ రూపాన్ని సంతరించుకుంటుందో ఎవరు చెప్పలేరు. ముఖ్యంగా సినిమా ప్రపంచంలో పైన చెప్పుకున్న విధంగా ఎక్కువ శాతం జరుగుతుంటుంది. అక్కడ సినిమాల్లో అవకాశం కోసం ఒకప్పుడు కాళ్ళు అరిగేలా తిరిగిన వాళ్ళ చుట్టూ ఇప్పుడు కాళ్ళు అరిగేలా తిరిగే ప్రొడ్యూసర్ లు ఉంటారు. అలా ఒకప్పుడు సినిమాలో వేషాల కోసం తిరిగిన విజయ్ సేతుపతి ఇప్పుడు భారత దేశ చిత్ర పరిశ్రమే తన కోసం తిరిగేలా చేసుకుంటున్నాడు . తాజాగా విజయ్ సేతుపతి ఒప్పుకున్న సినిమా గురించి చర్చ నడుస్తుంది.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ఇప్పుడు ఒక్క తమిళనాడు చిత్ర పరిశ్రమకే కాదు భారత దేశ చిత్ర పరిశ్రమ మొత్తానికే తెలుసు. ఆయన నటన చూస్తుంటే ఇండియన్ సినిమా ప్రేక్షకులు మొత్తం పూనకం వచ్చిన వాళ్ళలాగా ఊగిపోతారు. నటన అనే డిక్షనరీ లో ఎన్ని పాత్రలైతే ఉంటాయో అన్ని పాత్రల్లోనూ విజృభించి నటించడం విజయ్ సేతుపతి స్టైల్. ఇప్పుడు విజయ్ సేతు పతి ఇండియాలోనే అత్యంత బిజీ గా ఉన్న ఆర్టిస్ట్ .పెద్ద పెద్ద హీరో లు సైతం తమ సినిమా లో విజయ్ సేతు పతి ఉండాలని చెప్పి నిర్మాతలకి, దర్శకులకి సూచనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే విజయ్ సేతుపతి తమ సినిమాలో ఉంటే మా సినిమా సూపర్ హిట్ అనే నమ్మకం వాళ్లలో ఏర్పడింది.

ఇక అసలు విషయాన్ని వస్తే..ఒక పక్కన క్యారక్టర్బ్ రోల్స్ వేస్తూనే ఇంకో పక్క హీరో గా మక్కల్ సెల్వన్ చేస్తున్నాడు.ప్రస్తుతం ఆయన హీరోగా చేసిన మహారాజా సినిమా విడుదలకి సిద్ధం గా ఉంది. అలాగే విభిన్న చిత్రాల దర్శకుడు మిస్మిన్ దర్శకత్వం లో రూపొందుతున్న పిశాచి పార్ట్ 2 లోను విజయ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఇదే మిస్మిన్ దర్శకత్వం లో విజయ్ సేతు పతి హీరో గా తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది విజయ్ సేతుపతి వెంటనే మిస్మిన్ దర్శకత్వం లో హీరో గా చేస్తున్నాడంటే మంచి సబెక్టు అయ్యి ఉంటుందని కోలీవుడ్ లో చర్చ నడుస్తుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.