English | Telugu

అనీల్‌ సుంకర ట్వీట్‌తో మరోసారి ఏజెంట్‌, భోళాశంకర్‌పై చర్చ!

సినిమా రంగంలో జయాపజయాలు అనేవి సర్వసాధారణం. ఎలాంటి హోప్స్‌లేని సినిమా బ్లాక్‌బస్టర్‌ అవ్వొచ్చు. అదే విధంగా సినిమా డెఫినెట్‌గా సూపర్‌హిట్‌ అవుతుందన్న నమ్మకంతో చేసిన సినిమా సూపర్‌ ఫ్లాప్‌ అవ్వొచ్చు. ఈమధ్యకాలంలో అలాంటి ఘోరమైన పరాజయాల్ని చవిచూసిన నిర్మాత అనిల్‌ సుంకర. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఏజెంట్‌, భోళాశంకర్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆ రెండు సినిమాల వల్ల కలిగిన నష్టాల నుంచి బయటపడేందుకు కొంత సమయం పట్టొచ్చు. ఈ ప్రభావం అతని తర్వాతి సినిమాపై కూడా పడిరది. అయితే అనీల్‌ సుంకర్‌ చేసిన కొత్త ట్వీట్‌తో మరోసారి ఏజెంట్‌, భోళాశంకర్‌ చిత్రాల గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఎప్పుడో 2021లో సందీప్‌ కిషన్‌ హీరోగా ‘ఊరుపేరు భైరవకోన’ అనే సినిమాను స్టార్ట్‌ చేశారు. చాలా నెలల క్రితం ఒక పాటను రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకు టీజర్‌ రిలీజ్‌ చేశారు. గత ఆరు నెలలుగా ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. దీంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. జరుగుతున్న ప్రచారానికి తెర దించేందుకు అనీల్‌ సుంకర్‌ సోషల్‌ మీడియా వేదికగా ఒక ట్వీట్‌ చేశారు. ‘మేం ఖరీదైన తప్పులు చేశాం. అవి రిపీట్‌ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఉన్నాం. ‘ఊరుపేరు భైరవకోన’ సినిమాకి సంబంధించి విఎఫ్‌ఎక్స్‌ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీగా ఎఫెక్ట్స్‌ చూపించేందుకు ఎక్కువ సమయాన్ని దానికి కేటాయిస్తున్నాం. అందుకే డిలే అవుతోంది. ఈ వర్క్‌ పూర్తయిన వెంటనే రిలీజ్‌ డేట్‌ని ఎనౌన్స్‌ చేస్తాం. ఈ సినిమా తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాము. త్వరలోనే సినిమాకి సంబంధించిన రెండో పాటను విడుదల చేస్తాం’ అని ట్వీట్‌ చేశారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.