English | Telugu

'లైగ‌ర్‌'ను ఎవ‌రు ఆపుతారో చూస్తా!

విజ‌య్ దేవ‌ర‌కొండ టైటిల్ రోల్ పోషించిన 'లైగ‌ర్' మూవీ ఈ నెల 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనూహ్య‌మైన క్రేజ్‌తో రిలీజ‌వుతోంది. పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌లో అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించ‌గా, ర‌మ్య‌కృష్ణ‌, మైక్ టైస‌న్‌, విష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. కాగా కొన్ని రోజులుగా నిర్విరామంగా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ నిమిత్తం దేశ‌మంతా తిరుగుతున్నాడు విజ‌య్‌. ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో గాయ‌ప‌డి వెన్నునొప్పి బాధ‌పెడుతున్నా, సినిమా కోసం రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నాడు.

సినిమా కోసం రెండేళ్ల‌కు పైగా క‌ష్ట‌ప‌డ్డామ‌నీ, విడుద‌ల స‌మ‌యంలో రిలాక్స్ అయితే ఎలా అని హైద‌రాబాద్‌లో జ‌రిగిన మీడియా ఇంట‌రాక్ష‌న్‌లో విజ‌య్ చెప్పాడు. దాన్ని బ‌ట్టి 'లైగ‌ర్' మీద అత‌నికున్న న‌మ్మ‌కం, వ‌ర్క్‌పై అత‌ని క‌మిట్‌మెంట్ అర్థ‌మ‌వుతున్నాయి. అత‌ను ఎక్క‌డ‌కు వెళ్లినా సినీ ప్రియుల నుంచి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. కొన్ని చోట్ల జ‌నాన్ని అదుపు చేయ‌లేక ఈవెంట్స్ కేన్సిల్ అవుతుండ‌టం మ‌నం చూస్తున్నాం.

కాగా ఇటీవ‌ల కొన్ని భారీ బాలీవుడ్ సినిమాల త‌ర‌హాలోనే 'లైగ‌ర్‌'కు కూడా బాయ్‌కాట్ సెగ త‌గిలింది. ఓ వ‌ర్గం 'బాయ్‌కాట్ లైగ‌ర్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌లోకి తెచ్చారు. దాన్ని ఎదుర్కొంటూ 'ఐ స‌పోర్ట్ లైగ‌ర్‌', 'అన్‌స్టాప‌బుల్ లైగ‌ర్' అనే ట్రెండ్స్ వ‌చ్చాయి. 'బాయ్‌కాట్ లైగ‌ర్' ట్రెండ్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న‌దైన స్టైల్‌లో స్పందించాడు. ఢిల్లీలో జ‌రిగిన ఈవెంట్‌లో "నాకు మా అమ్మ ఆశీర్వాదం ఉంది. ప్ర‌జ‌ల ప్రేమాభిమానాలు ఉన్నాయి, దేవుని ద‌య ఉంది. గెల‌వాల‌నే ఫైర్ లోప‌ల ఉంది. ఇక మమ్మ‌ల్ని ఎవ‌రు ఆపుతారో చూస్తాను" అంటూ కౌంట‌ర్ ఇచ్చాడు. ఇది అత‌నిలోని ఆత్మ‌విశ్వాసానికీ, నిర్భ‌య‌త్వానికీ నిద‌ర్శ‌న‌మ‌ని అత‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.