English | Telugu

'సొంతం' సినిమా.. 'శేషం'గా సునీల్ అలరించి నేటికి 20 ఏళ్ళు!

టాలీవుడ్ లో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని కామెడీ సినిమాల్లో 'సొంతం' ఒకటి. ఆర్యన్ రాజేష్, నమిత జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకుడు. ఆగస్టు 23, 2002 న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ప్రేక్షకులను హాయిగా నవ్వుకునేలా చేస్తున్న ఈ చిత్రం నేటితో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

'సొంతం' సినిమా హీరోగా ఆర్యన్ రాజేష్ కి రెండోది, దర్శకుడిగా శ్రీనువైట్లకు మూడోది కాగా.. నమితకు హీరోయిన్ గా మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమా ముగ్గురి కెరీర్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక ఈ చిత్రంలో సునీల్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. శేషం పాత్రలో సునీల్ నవ్వులు పూయించాడు. తన కామెడీ టైమింగ్, డైలాగ్ మాడ్యులేషన్ తో 'సొంతం' సినిమా అనగానే ముందుగా సునీల్ పేరు గుర్తొచ్చేలా చేసుకున్నాడు. అలాగే ఈ చిత్రంలో రోహిత్, ఝాన్సీ, ఎంఎస్ నారాయణ, ధర్మవరం, సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, తెలంగాణ శకుంతల, చిత్రం శ్రీను, అలీ, వేణు మాధవ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు నటించి మెప్పించారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని అన్ని సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'సొంతం', 'తెలుసునా', 'నాయుడో నాయుడో' సాంగ్స్ విశేష ఆదరణ పొందాయి. జేడీ ఆర్ట్స్ బ్యానర్ పై ఎస్.సోంపల్లి, వి.ఆర్.కన్నెగంటి నిర్మించిన ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. శ్రీను వైట్ల స్టొరీ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి చింతపల్లి రమణ సంభాషణలు రాశారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.